CM Jagan-Chandrababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలకు సంబంధించి కీలక పరిణమాం చోటు చేసుకోనుంది. ఎవరూ ఊహించని విధంగా ఒకే వేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పంచుకోనున్నారు. నేడు ప్రధాని మోదీ (Prime Minister Modi) అధ్యక్షతన జరిగే జీ-20 సమావేశానికి సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు అవ్వాలి అంటూ.. అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగా ఈ ఇద్దరు నేతలు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు.
2022 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2023 నవంబర్ 30 వరకూ జీ 20(G 20) దేశాల కూటమికి భారతదేశం (India) అధ్యక్షత వహిస్తోంది. దీనిని విజయవంతం చేసేందుకు.. కేంద్రం అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. మోదీ(Modi) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. దీని కోసం అన్ని పార్టీల అధ్యక్షులకు ఇప్పటికే ఆహ్వానం అందింది. సోమవారం సాయంత్రం.. 5 గంటలకు సదస్సు జరగనుంది.
భారత్లో నిర్వహించే గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G -20) భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల(Political Parties) అధ్యక్షులతో ప్రధాని చర్చిస్తారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం సాయంత్రం 5 గంటలకు సదస్సు ఉంటుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా.. సీఎం జగన్(CM Jagan), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఆహ్వానం అందింది. సోమవారం సీఎం జగన్ దిల్లీ బయలుదేరి వెళ్తారు. జీ-20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ సమావేశానికి వెళ్తున్నారు. ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్(Hyderabad)లోని తన నివాసం నుంచి చంద్రబాబు దిల్లీ బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుని.. రాత్రి 7 గంటల వరకు అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. అయితే ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత హాజరుకానున్న సమావేశం కావడంతో ఏపీలో ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి : రాష్ట్రానికి ఇదేం కర్మ.. రెండు పార్టీల నినాదం అదే.. పేలుతున్న మాటల తూటాలు
రెండు వారాల క్రిందటే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదిక పంచుకోనున్నారు. సాధరణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జగన్, చంద్రబాబు మధ్య ఉన్నది కేవలం రాజకీయ వైరంగా లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంతటి వేడి వాతావరణం ఉంది. ఇద్దరి మధ్య వ్యక్తిగత వైరం తారా స్థాయి దాటిపోయింది. ఒకరి ముందు ఇంకొకరి పేరు తీస్తేనే ఆగ్రహంతో రిగిలిపోయే పరిస్థితులు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu