CM Jagan on 10th Paper leak: జగనన్న విద్య దీవెన (Jagananna Vidya Divena) కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Prdesh) సీఎం జగన్ (CM Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం విద్య దీవెన పధకం అమలు చేస్తుంటే..? విపక్షాలు పదో తరగతి పరీక్ష పాత్రలను లీక్ (10th Class Exam papers Leak) చేసేందుకు సహకరిస్తున్నాయని.. తిరిగి ప్రభుత్వం పై బురదచల్లే కార్యక్రమం చేపట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నారాయణ (Narayan), చైతన్య (Chitanya) సంస్థలు లీక్ చేసి.. తిరిగి దొంగే దొంగ దొంగ అంటూ ప్రభుత్వం పై కుతంత్రాలు చేస్తుండడం దారుణమన్నారు. గ్రామా, వార్డు స్థాయిలో సచివాలయాలు అమలు చేసి, నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని.. ప్రజలకు ఏ లబ్ది చేయని ఎల్లో పార్టీతో పాటుగా... ఎల్లో మీడియా తమపై అసత్య ఆరోపణలు చేయడం బాధ కలిగిస్తోంది అన్నారు. మహిళల రక్షణ., సాధికారతకు ఏ ప్రభుత్వం చేయని విధంగా చర్యలు చేస్తున్నా.. కుట్రలు చేయడంపై ఆయన మండిపడ్డారు.
తిరుపతి పర్యటన సందర్భంగా.. తారకరామ స్టేడియంలో విద్యాదీవెన నగదు జమను ప్రారంభించారు సీఎం జగన్.. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు గురించి తమ ప్రభుత్వం ఏం చేస్తోందో చెబుతూనే.. విపక్షాల తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను అన్నారు. అయితే దేవుడి దయతో ఇది సాగుతోందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. చదువు అనేది గొప్ప ఆస్తి.. ఎవరూ దొంగిలించలేని ఆస్తి అని.. తలరాతలు మార్చేసే శక్తి చదువుకు ఉందని నమ్మే వ్యక్తిని తాను అన్నారు. అందుకే 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడం సంతోషంగా ఉందని జగన్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : సహపంక్తి భోజనాలతో సిక్కోలులో ఫుల్ జోష్.. బాదుడే బాదుడులో జగన్ పై నిప్పులు
స్వర్గీయ వైఎస్సార్ పిల్లల చదువుపై ఆలోచన చేసిన వ్యక్తి అని.. తండ్రి ఒక్క అడుగు వేస్తే తనయుడు జగన్ నాలుగు అడుగులు వేస్తున్నాడు అన్నారు. పేద విద్యార్థుల క్షోభను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని.. తండ్రి ఫీజులు కట్టలేక అప్పుల పాలు అవుతుంటే... విధ్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు తన పాదయాత్రలో చూసాను అన్నారు. అందుకే క్రమం తప్పకుండ పిల్లలకు అడుగడునా తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటోంది అని గుర్తు చేశారు.
ఇదీ చదవండి : మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్.. హైదరాబాద్ లో రోడ్లపై వైసీపీ మీమ్స్
పూర్తి స్థాయి ఫీజు రియింబర్స్ మెంట్ ప్రతి త్రైమాసికంలో విద్యార్థి తల్లి ఖాతాలో వేస్తున్నాం అన్నారు. జగన్ అన్న విద్య దీవెన., వసతి దీవెనకు అక్షరాలా 10994 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన ఏకైన ప్రభుత్వం తమదే వెల్లడించారు. ప్రతి కుటుంబం నుంచి ఓ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ స్థాయికి వచ్చేలా పెట్టుబడి ప్రభుత్వం పెడుతోందని గర్వంగా చెప్పుకుంటున్నాం అని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మార్చేసిన కార్యక్రమం నాడు నేడు అని.. మన ప్రభుత్వం మన పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని.. కానీ చంద్రబాబు హయాంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్లను మూసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th Class Exams, Andhra Pradesh, Ap cm jagan, Tirupati