హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anna Canteen: 2 రూపాయలకే చికెన్ రైస్.. అన్న క్యాంటీన్‌లో స్పెషల్ ఫుడ్.. ఎక్కడో తెలుసా? ప్రత్యేకత ఏంటి..?

Anna Canteen: 2 రూపాయలకే చికెన్ రైస్.. అన్న క్యాంటీన్‌లో స్పెషల్ ఫుడ్.. ఎక్కడో తెలుసా? ప్రత్యేకత ఏంటి..?

రెండు రూపాయలకే చికెన్ రైస్

రెండు రూపాయలకే చికెన్ రైస్

Anna Canteen: ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుతం అన్న క్యాంటీన్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఓ వైపు టీడీపీ అన్న క్యాంటీన్ లు.. పెంచాలని ప్రయత్నాలు చేస్తుంటే.. ఇటు వైసీపీ అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తోంది. దీంతో రాజకీయంగా ఈ అన్న క్యాంటీన్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే తాజాగా 2 రూపాయలకే చికెన్ రైస్ అందించారు..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hindupur, India

  Hindupur Anna Canteen: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అన్న క్యాంటీన్ల  (Anna Canteen) విషయంలో రాజకీయ రగడ కొనసాగుతోంది. అన్న క్యాంటీన్ల కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీశాయి. వైసీపీ (YCP), టీడీపీ (TDP) మధ్య అన్న క్యాంటీన్ల వ్యవహారం చిచ్చు రాజేసింది. ఇరు పార్టీల నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. టీడీపీకి కీలక నియోజకవర్గాలైన మంగళగిరి (Mangalagiri), కుప్పం (Kuppam) ల్లో ప్రారంభించిన అన్న క్యాంటీన్లు కూడా పెను వివాదానికి కారణమైంది. ఇక కుప్పంలో అయితే కురుక్షేత్రమే జరిగింది. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లపై దాడి చేయడం ఏంటని చంద్రబాబు నాయుడు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు.

  దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అన్న క్యాంటీన్లకు అనుమతి లేదని చెబుతూ ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు ఇది ఇలా ఉంటే.. హిందూపురంలో మాత్రం అన్న క్యాంటీన్.. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 2 రూపాయలకే చికెన్, మసాల రైస్, పప్పన్నం, స్వీట్ పెట్టారు. పేదలకు టీడీపీ నాయకులు స్వయంగా వంటలు వడ్డించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లపై ప్రభుత్వం కక్ష కట్టిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ తో పాటు ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య పథకం కూడా అమలు చేస్తున్నామని చెప్పారు.

  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా హిందుపురంలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర మే నెలాఖరులో అన్న క్యాంటీన్‌ ను ప్రారంభించారు. ఆ క్యాంటీన్ వంద రోజులు పూర్తి చేసుకుంది. సాధారణంగా 2 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్నారు. 100 రోజులు పూర్తయిన సందర్భంగా పేదలకు ప్రత్యేక భోజనాన్ని అందించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించారు. అందుకే కేవలం రెండు రూపాయలకే చికెన్, మసాల, గుడ్డు, ఒక స్వీటు వడ్డించారు.

  ఇదీ చదవండి : దోషులు ఎవరినీ వదిలిపెట్టను.. అది మా తప్పే అన్న చంద్రబాబు నాయుడు

  అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు 2 రూపాయలకే భోజనం అందిస్తున్నామని బాలకృష్ణ భార్య వసుంధర తెలిపారు. బాలకృష్ణతో పాటు అమెరికాలో ఉంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారని ఆమె చెప్పారు. తన చేతుల మీదుగా ప్రారంభించిన ఈ క్యాంటీన్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

  ఇదీ చదవండి : ముద్రగడ ఫ్యామిలీకి వైసీపీ బంపర్ ఆఫర్.. పవనే టార్గెట్ గా భారీ వ్యూహం

  2 రూపాయలకే భోజనం ఇవ్వడం ఈ అన్నా క్యాంటీన్ ప్రత్యేకత అన్నారు. ఇలాంటిది ఎక్కడా చూసి ఉండరు. హిందూపురంలోనే ఇది సాధ్యమైంది అన్నారు. త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేస్తే బాగుంటుంది అని వసుంధర చెప్పారు. కాగా, ఇటీవల తెనాలిలో అన్న క్యాంటీన్ తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. అన్న క్యాంటీన్ నిర్వహణతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. నోటీసులు ఇచ్చిన గంట వ్యవధిలో అన్నక్యాంటీన్ తొలగించమనడం సరికాదన్నారు. అదే ప్రాంతంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తామని తేల్చి చెప్పారు.

  ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మాజీ జేడీ.. పొలంలో అది పోయింది అంటూ కేసు.. ఏం జరిగిందో తెలుసా?

  అన్న క్యాంటీన్ల తొలగింపుపై నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. అన్నం తినే వారెవరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని అన్నారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అన్న క్యాంటీన్లను అడ్డుకున్నారని, ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Hindupuram, Nandamuri balakrishna

  ఉత్తమ కథలు