హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: సీఎం జగన్ లో సడన్ ఛేంజ్ ను గమనించారా..? ఆ మార్పుకు కారణాలు ఇవేనా..?

YS Jagan: సీఎం జగన్ లో సడన్ ఛేంజ్ ను గమనించారా..? ఆ మార్పుకు కారణాలు ఇవేనా..?


ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు  10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.

ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.

సీఎం జగన్ (AP CM YS Jagan)ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. ఎంతలా ఆరోపణలు చేసినా ఆయన మొహంలో చిరునవ్వే కనిపిస్తుంది. ఎవరిపైనైనా విమర్శలు చేయాలన్నా చిరునవ్వుతోనే చేస్తారు.

  సీఎం జగన్ (AP CM YS Jagan)ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. ఎంతలా ఆరోపణలు చేసినా ఆయన మొహంలో చిరునవ్వే కనిపిస్తుంది. ఎవరిపైనైనా విమర్శలు చేయాలన్నా చిరునవ్వుతోనే చేస్తారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆవేశంతో ప్రసంగాలు చేసినా సీఎం అయిన తర్వాత మాత్రం తన పంథాను పూర్తిగా మార్చేశారు. రాజకీయ శత్రువు చంద్రబాబు (Chandrababu) పై విమర్శలు చేసినప్పుడు, జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyna) వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చినప్పుడు ఆయన పెద్దగా ఆవేశానికి లోనయ్యేవారు కాదు. కొన్నిసార్లు వారి పేర్లు కూడా ఎత్తేవారు కాదు. కానీ ఇటీవల జగన్ వైఖరిలో మార్పొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షాలపై విమర్శలు చేసే సమయంలో కాస్త ఆవేశం కనిపిస్తోంది. వారిపై ఒకింత తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారాయన.

  గురువారం పల్నాడు జిల్లాలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మాట్లాడిన జగన్.. టీడీపీ, జనసేనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ ను ఉద్దేశిస్తూనే పరోక్షంగా విమర్శలు చేసిన ఆయన.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వారికి భయం పట్టుకుందని.. బాక్సులు బద్దలవుతాయనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు అయన దత్త పుత్రుడు కొత్త ప్రచారం అందుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారు దొంగలు ముఠా.., ఎన్నికల అయున తరువాత హైదరాబాద్ పారిపోయిందని ఎద్దేవా చేశారు. వాళ్లలా చేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందని.. మన పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో రాష్ట్ర ఖజానాకు దోచుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారన్నారు. అసూయకు మందు లేదని.., అది మంచిది కాదు.. అలాగే ఉంటే త్వరగా బీపీలు, షుగర్ వచ్చి టికెట్ తీసుకుంటారు" అంటూ సీఎం విమర్శలు చేశారు.

  ఇది చదవండి: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే.. హోర్డింగులకూ విద్యుత్ బంద్.. మాల్స్ పైనా ఆంక్షలు

  శుక్రవారం నంద్యాలలో జగనన్న వసతిదీవెన (Jagananna Vasath Deevena) రెండో విడత నగదును విడుదల చేసిన జగన్.. ప్రతిపక్షాలపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు టీడీపీకి. చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కు కనిపించవని విమర్శించిన జగన్.. ఢిల్లీలో కూడా రాష్ట్ర పరువును తీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దౌర్భాగ్యపు ప్రతిపక్షం ఉందని.., డిల్లీ లెవల్లో మన రాష్ట్ర పరువును తాకట్టు పెడుతుందన్నారు. వైఎస్ జగన్ అనే నేను.. దేవుని దయ.. ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానని.. ప్రజల దీవెనలు ఉన్నంత వరకు వీరంతా నా వెంట్రుక కూడా పీకలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందులేదన్న జగన్.. ఇలాగే చేస్తే గుండెపోటు వచ్చి టికెట్ తీసుకుంటారంటూ ఎద్దేవా చేశారు.

  ఇది చదవండి: కేబినెట్ పై సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఆ 10 మందికి సెకండ్ ఛాన్స్..?

  ప్రశాంతంగా ఉండే సీఎం ఇలా ఘాటు విమర్శలు చేయడం వెనుక కారమం ఏమై ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత, మంత్రి పదువుల విషయంలో ఒత్తిడి, విద్యుత్ సంక్షోభం, అప్పుల వంటి అంశాల్లో కాస్త అసహనంతో ఉండి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారన్నారా.. లేక సంక్షేమ పథకాలపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న బాధతో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారా..? అనే చర్చ జరుగుతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు