AP POLITICS CHANDRABAU NAIDU STRONG WARING TO CM YS JAGAN MOHAN REDDY IN KURNOOL DISTRICT TOUR NGS
ChandraBabu: నేను కన్నెర్ర చేస్తే.. సీఎం జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నారంటే..?
చంద్రబాబు (ఫైల్)
Chandra Babu: ఆంధ్రప్రదేశ్ లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేతలంతా ఢీ అంటే ఢీ అంటున్నారు? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో జిల్లాల బాట పట్టారు. తాజాగా కర్నూల్లో పర్యటించిన ఆయన.. సీఎం జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..
Chandra Babu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంట ఎన్నికల వాతావరణ కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార, విపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రచ్చరచ్చ అవుతోంది. ఇప్పటి నుంచి అన్ని పార్టీలో ఎన్నికలకు సై అంటున్నాయి. అందులో భాగంగా ప్రత్యేక వ్యూహాలకు పదును పెడుతున్నాయి పార్టీలు. అధికార వైసీపీ (YCP) గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో ప్రజల్లోనే ఉంది. త్వరలోనే మంత్రులు బస్సు యాత్రలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సామాజిక న్యాయం పేరుతో ఆ యాత్ర చేపట్టనున్నారు. ప్లీనరీ తరువాత సీఎం జగన్ (CM Jagan) సైతం.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu).. బాదుడే బాదుడు పేరుతో జిల్లాల బాట పట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు.. దుర్మార్గ పాలలను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపు ఇస్తున్నారు.
తాజాగా కర్నూలు జిల్లా (Kurnool District) పర్యటనలో సీఎం జగన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో విధ్వంస పాలనకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని ఛాలెంజ్ చేశారు. నిజంగా తాను కన్నెర్ర చేస్తే.. సీఎం జగన్ తట్టుకోలేరని హెచ్చరించారు. జగన్ పాలనలో ప్రజలకు వేధింపులు, అప్పులు, బాదుడే బాదుడు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : జనసేన వైపు ఆ కీలక వైసీపీ నేతల చూపు.. సీఎం జగన్ ఆఫర్లు పని చేయలేదా..?
కర్నూలులో టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించి వైసీపీ జెండాలు పెట్టడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని.. తమ పార్టీని ఎవరూ ఏం చేయలేరన్నారు. మహానాడు నుంచి దృష్టి మళ్లించేందుకు వైసీపీ బస్సు యాత్ర ప్లాన్ చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై త్వరలో ఒంగోలులో జరిగే మహానాడులో చర్చించుకుందామని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వంపై పోరాడే ప్రతి కార్యకర్త వీరుడేనని తెలిపారు. జగన్ విధానాలతో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. నదుల అనుసంధానం, పోలవరంతో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని కలలు కన్నామని.. కానీ ఆ కలల్ని జగన్ నాశనం చేశారంటూ చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.