పశ్చిమ గోదావరి జిల్లా దేందులూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, లోకేష్ ను చంపుతామని వైసిపి నేతలు చేబుతున్నారు. వాళ్ల బాబాయిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని సీఎం జగన్ (Cm Jagan) పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జగన్ కు పోలీసులు ఉంటే తనకు ప్రజలున్నారని చంద్రబాబు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. చివరి అవకాశం తనకు అని చంద్రబాబు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం ఉండవని అన్నారు. చరిత్ర అవసరం లేదు. కానీ ఈసారైనా ప్రజలు కళ్లు తెరవాలని చంద్రబాబు (Chandrababu Naidu) పేర్కొన్నారు. వాళ్లు తలచుకుంటే మొద్దు శ్రీనును మా ఇంటికి పంపించేవారని రాయలసీమలో ఒకరు అంటున్నారని ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేశారు.
బాబాయిని చంపినంత సులువుగా అంటూ..
ఇక తన బాబాయిని చంపినంత ఈజీగా తనను చంపొచ్చని అనుకుంటున్నారని చంద్రబాబు (Chandrababu Naidu) ఆరోపించారు. అలాగే లోకేష్ ను కూడా లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారని అన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని చంద్రబాబు (Chandrababu Naidu) సవాల్ చేశారు. దేందలూరు లండన్ బాబు ఇక శాశ్వతంగా లండన్ కే పరిమిత అవుతారని ఎద్దేవా చేశారు. కోతలతో విద్యాదేవేన నిధులు ఇస్తున్నారని మండిపడ్డారు.
ఇక రివర్స్ టెండర్ పేరుతో పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల నెత్తిన రూ.2.75 లక్షలు అప్పు ఉందని చంద్రబాబు (Chandrababu Naidu) తెలిపారు. పోలవరం బాధితులకు ఇంతవరకు పునరావాసం కల్పించలేదని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు ఎందుకు చంపారో జగన్ రెడ్డి చెప్పాలని చంద్రబాబు (Chandrababu Naidu) అన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. అంతేకాదు సాక్షులను కూడా బెదిరిస్తున్నారని చంద్రబాబు (Chandrababu Naidu) అన్నారు.
నిధులిచ్చేది కేంద్రమే..
పోలవరానికి కేంద్రమే నిధులు ఇస్తుందని అయినా కానీ ప్రాజెక్టును నాశనం చేస్తున్నారని చంద్రబాబు (Chandrababu Naidu)ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు, చైతన్యం రావాలి. భయపడకుండా దైర్యంగా ఉండాలని చంద్రబాబు (Chandrababu Naidu) సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Chandrababu Naidu, Cm jagan, YS Vivekananda reddy