Home /News /andhra-pradesh /

AP POLITICS CHANDRABABU SAY ALL LEADERS TO READY ROR FIGHT WILL CM CALLED PRE PONED 2024 ELECTIONS NGS GNT

Chandrababu: ప్రభుత్వం నడపడం అంత ఈజీ కాదని సీఎంకు అర్థమైంది.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వండి.. నేతలకు చంద్రబాబు పిలుపు

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఫిక్స్ అయ్యాయా..? సీఎం జగన్ అదే ఆలోచనతో ఉన్నారా..? అసలు ఎందుకు సీఎం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి అనుకుంటున్నారు... ఈ వార్తలు ఎంత వరకు వాస్తవం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం.. ముందస్తుకు సిద్ధమవ్వండి అంటూ పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  Chandrababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముందస్తు ఎన్నికల తప్పవు అంటున్నారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ముందుకు వెళ్లే కొద్దీ ప్రభుత్వం నడపడం అంత ఈజీ కాదని సీఎం జగన్ కు అర్థమైంది అంటున్నారు.  పార్టీ నేతలతో ఆ  అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Niadu) టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడు (Mahanadu)పై సమీక్ష నిర్వహించారు. అలాగే ముందస్తు ఎన్నికల ప్రస్తావనపై చంద్రబాబు చర్చించారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఎందుకంటే ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని సీఎం జగన్‌ (CM Jagan)కూ అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం జగన్ అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా బూటకమేనన్న విషయం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల్లోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తోంది అని అభిప్రాయపడ్డారు. వీటన్నింటినీ గుర్తించిన తరువాతే.. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని పార్టీ నేతలకు చంద్రబాబు వెల్లడించారు.

  కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు టీడీపీ (TDP) పైనే ఆశలు పెట్టుకున్నారని.. అందుకే గ్రామాల్లో టీడీపీకి స్వాగతాలు పలుకుతుంటే.. గడపగడపలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు నిలదీతలే ఎదురవుతున్నాయన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో గ్రామ స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యకుండా ఇంటింటికీ వెళ్లాలన్నారు. పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను.. వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ నేతలపైనే ఉందని సూచించారు.

  ఇదీ చదవండి : ఏపీ రాజ్య సభ్యులు వీరే.. తెలంగాణ వ్యక్తికి పదవిపై మంత్రి ఏమన్నారంటే..?

  వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర కష్టాల పాలయ్యారని.. ప్రజల గురించి ప్రభుత్వానికి అస్సలు పట్టదన్నారు. పాలనా వైఫల్యాలు, ప్రభుత్వ నిర్ణయాలతో దాదాపు అన్ని వర్గాల ప్రజలు కష్టాలపాలవుతున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యకుండా ఇంటింటికీ వెళ్లాలని నేతలకు సూచించారు. ఇప్పటికే టీడీపీ శ్రేణులు, నేతలు గ్రామాల్లో ఇళ్ల కు వెళుతుంటే... ప్రజలు ఎదురొచ్చి తమ కష్టాలు చెప్పుకుంటున్నారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

  ఇదీ చదవండి : గడప ముందుకొచ్చిన రోజా.. పెళ్లి చేయమన్న వృద్ధుడు.. మంత్రి రియాక్షన్ ఇదే

  ఇటీవల తన జిల్లాల పర్యటనకు వస్తున్న స్పందనను కూడా నేతలతో చంద్రబాబు పంచుకున్నారు. నాయకులు అనే వారు నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని... అన్ని వర్గాలలో, అన్ని ప్రాంతాలలో అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. .టిడిపికి ఇదొక మంచి శుభసూచికం అన్నారు. అప్పుడూ ఇప్పుడని కాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా వుండాలని చంద్రబాబు సూచించారు.

  ఇదీ చదవండి : మళ్లీ తెరపైకి సత్యం బాబు.. ఆ పని చేయండి ప్లీజ్ అంటూ ప్రభుత్వానికి వినతి

  ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే గత కొంతకాలంగా జరుగుతున్న ముందస్తు ప్రచారం నిజమేనని అనిపిస్తుంది. సజ్జల మీడియాతో మాట్లాడుతూ ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి బాగా వెళ్లిందని, జగన్ అమలు చేసిన పథకాలు విజయవంతం అయ్యాయని అన్నారు. మాములుగా అయితే ఏపీలో మరో రెండేళ్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే సజ్జల మాత్రం ఏడాది, రెండేళ్లలో అని చెప్పడం ద్వారా వైసీపీ క్యాడర్‌లోని ముందస్తు సంకేతాలు పంపారనే టాక్ వినిపిస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు