Home /News /andhra-pradesh /

AP POLITICS CHANDRABABU NAIDU SLAMS ON YCP LEADERS AND CM JAGAN AND KUPPAM YCP LEADER ISSUE NGS

Chandrababu Naidu: సొంతవారిని కూడా బలితీసుకుంటున్న అధికార పార్టీ.. చంద్రబాబు బహిరంగ లేఖ

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల దాహానికి మనుషుల ప్రాణాలు పోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు విపక్షాల పార్టీ నేతల ప్రాణాలను తీసిన అధికార పార్టీ.. ఇప్పుడు సొంతం పార్టీ నేతలను కూడా బలి తీసుకోవడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై బహిరంగ లేఖ రాశారు.. ఆయన ఏం చెప్పారంటే..?

ఇంకా చదవండి ...
    Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార పార్టీ తీరుకు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మండిపడ్డారు. తాజాగా తన సొంత నియోజకవర్గం  కుప్పం (Kuppam) వైసీపీ నేత పార్థసారథి (YCP Leaders Parthasarathi) ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏ పార్టీ వ్యక్తి అయినా ఆత్మహత్య బాధాకరం అని బహిరంగ లేఖ రాశారు. వైసీపీ నేతల వేధింపులకు.. చివరకు సొంత పార్టీ నేతలు కూడా బలవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. పార్థసారధి ఆత్మహత్యకు కారకులైన వారిపై ఇప్పటివరకు ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయడం లేదని టీడీపీ అధినేత  ప్రశ్నించారు. సూసైడ్ సెల్ఫీ వీడియోలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా  కేసు  నమోదు చేయడం లేదు అంటే.. ఎవర్ని కాపాడాలి అనుకుంటున్నారని ప్రశ్నించారు.  డబ్బులకి పదవులు అనే విష సంస్కృతి కుప్పంలో తీసుకువచ్చారని వాపోయారు. దాని పార్థసారథి ఘటనే ఉదహరణ అన్నారు.

    తాజాగా కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గతంలో పని చేసిన ఓ వైసీపీ నేత పార్థసారథి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వైసీపీలో సంచలనంగా మారింది. సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేస్తూ సెల్ఫీ వీడియో చేసి మరి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గతంలో కుప్పం మున్సిపాలిటీ కాక ముందు వార్డు సభ్యునిగా రెండు సార్లు పనిచేశారు. వైసీపీలో క్రియాశీలకంగా పనిచేశాడు. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పోటీ చేసేందుకు అవకాశం లభించలేదు. తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీలో మరోసారి అవకాశం లేదని స్పష్టం కావడంతో పార్థసారథి తీవ్ర మనస్థాపానికి గురయ్యడు. ఇందుకోసమే ఆత్మహత్య చేసుకున్నారనే వాదన వినిపించింది.

    ఇదీ చదవండి : చంద్రబాబుకు ఆ సమస్య.. దేవుడు కరుణిస్తే వచ్చే ఎన్నికల వరకు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు

    ఇప్పుడు ఆయన ఆత్మహత్య వ్యవహారంపై సూసైడ్ సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. తన ఆత్మహత్యకు గల కారణాలను పార్థసారథి వెల్లడించారు. కుప్పం గంగమ్మ ఆలయ చైర్మన్‌గా రెండేళ్లు కొనసాగినా.. కరోనా కారణంగా జాతర చేయలేక పోయాయని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. మరో నెలలో రానున్న జాతర జరిపించి పదవీ నుంచి దిగిపోతానని.. స్థానిక నేతలకు చెప్పినా.. తనకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాసి తీవ్ర మనస్థాపానికి గుర్తించాడు.

    ఇదీ చదవండి : : ఏపీ కొత్త కేబినెట్ ఎలా ఉండబోతోంది అంటే..? సజ్జలతో సీఎం భేటీకి కారణం అదేనా..?

    గంగమ్మ గుడి చైర్మన్ పదవి కోసం 35 లక్షల రూపాయలు ఖర్చు చేశానని, పదవి ఇచ్చినందుకు 15 లక్షలు ఖర్చు చేశానని, బోర్డు ఏర్పాటు కోసం 10 లక్షలు, ఆలయంలో మరమ్మతుల కోసం మరో పది లక్షలు అప్పు చేసి డబ్బులు వెచ్చించానని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటికీ తెచ్చిన డబ్బులకు వడ్డీ కడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా పార్టీని నమ్ముకున్నా తనకు అన్యాయం చేశారని.. అది తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఒక్క ఘటన చాలు.. సొంత పార్టీ నేతలు కూడా అధికార పార్టీలో ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నదానికి అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kuppam, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు