హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: ఎన్టీఆర్ పేరు మార్పు ముమ్మాటికి అలాంటిదే.. జగన్‌పై చంద్రబాబు ఫైర్

Chandrababu: ఎన్టీఆర్ పేరు మార్పు ముమ్మాటికి అలాంటిదే.. జగన్‌పై చంద్రబాబు ఫైర్

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

AP Politics: దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్‌కు ప్రాముఖ్యత ఇచ్చింది తానేనని చెప్పారు. తాను అనుకుని ఉంటే కడపకు రాజశేఖర్ రెడ్డి పేరు ఉండేదా ? అని చంద్రబాబు ప్రశ్నాంచారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అన్ని విషయాల్లో జగన్ అబద్దాలే చెబుతున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీ కోసం ప్రత్యేకంగా మెడికల్ యూనివర్సిటీ తెచ్చింది ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్ఆర్(YSR) పేరు పెడతారా ? అని మండిపడ్డారు. ఎన్టీఆర్(NTR( పేరు మార్పు తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బ తీయడమే అని ఆరోపించారు. దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్‌కు ప్రాముఖ్యత ఇచ్చింది తానేనని చెప్పారు. తాను అనుకుని ఉంటే కడపకు రాజశేఖర్ రెడ్డి పేరు ఉండేదా ? అని చంద్రబాబు(Chandrababu) ప్రశ్నాంచారు. హర్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్ ఆర్ పేరు ఉండేదా ? అని వ్యాఖ్యానించారు. పేరుమార్పుతో జగన్ నీచ బుద్ది బయటపడిందని మండిపడ్డారు. జగన్ చేతగాని దద్దమ్మ కబుర్లు చెపుతూ తనను విమర్శిస్తున్నారని ఆరోపించారు.

  కడపలో స్టీల్ ప్లాంట్ కట్టి నీ తండ్రి పేరు పెట్టుకోవాలని జగన్‌కు సవాల్ విసిరారు. 24 ఏళ్ల క్రితం పెట్టిన పేరును ఇప్పుడు జగన్ తొలగిస్తాడా ? అని ప్రశ్నించారు. జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, కృష్ణకాంత్ వంటి వారి పేర్లుపెట్టి సంస్థలు నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని.. అప్పుడు జగన్ రెడ్డి కథ చెపుతామని అన్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇది తప్పని ప్రతి ఇంటికి చేరవేద్దామని చెప్పుకొచ్చారు.

  బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు. బిసిలను అంతకుముందు ఓటు బ్యాంకుగా చూశారని.. పదవులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వచ్చిన తరువాత బిసిలకు రాజ్యాధికారం సాధ్యం అయ్యిందని చెప్పారు. టీడీపీ వచ్చిన తరువాత బిసిల నుంచి నాయకత్వాన్ని పెంచామని చెప్పారు. అధికారంలో బీసీలను భాగస్వాములను చేశామని.. దీంతో బిసి వర్గాలు శక్తివంతమైన వర్గాలు అయ్యాయని అన్నారు. బిసిల నాయకత్వం పెంచడం కోసం స్థానిక సంస్ధల్లో రిజర్వేషన్లు పెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ 24 శాతం చేస్తే...తాను దాన్ని 34 శాతానికి పెంచానని చంద్రబాబు గుర్తు చేశారు.

  YS Jagan: ఎన్టీఆర్‌పై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అన్ని ఆలోచించిన తరువాతే..

  NTR: వైసీపీ సర్కార్ కు వల్లభనేని వంశీ షాక్.. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ఎమ్మెల్యే.. ఎందుకంటే

  జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బిసిల రిజర్వేషన్లను పది శాతం తగ్గాయని ఆరోపించారు. జగన్ కారణంగా 16 వేల మంది బిసి సోదరులు పదవులకు దూరం అయ్యారని విమర్శించారు. కేంద్రంలో ఏకైక క్యాబినెట్ మంత్రి పదవి వస్తే దాన్ని ఎర్రం నాయుడుకు ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్నత శాఖలు అన్ని బిసిలకు ఇచ్చామని అన్నారు. మూడున్నరేళ్ల జగన్ పాలన తరువాత 90 శాతం బిసిలు మళ్లీ టిడిపి వైపు వచ్చారని అన్నారు. జగన్ ఏర్పాటు చేసిన 54 కార్పొరేషన్‌లు ఏం చేస్తున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మంచి అవకాశాలు ఉన్న సమయంలో వైసిపి పాలనతో నష్టం జరుగుతోందని.. జగన్ తుగ్లక్ పాలనకు ఇక ఇటు ఎవరూ రారని విమర్శించారు. మన పిల్లల భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీ మళ్లీ రావాలని పిలుపునిచ్చారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu

  ఉత్తమ కథలు