Home /News /andhra-pradesh /

AP POLITICS CHANDRABABU NAIDU SLAMS ANDHRA PRADESH GOVERNMENT ON JOBS CALENDAR NGS

Chandrababu: యువత అంటే అంత చులకనా..? ఆ హామీ అమలయ్యేదెప్పుడు అని చంద్రబాబు ప్రశ్న

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu Naidu on Jobs: ఏపీ ప్రభుత్వంపై మరోసారి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఉద్యోగాల భ‌ర్తీపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్‌-1 ఉద్యోగాల అభ్యర్థుల విష‌యంలో అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు..?

ఇంకా చదవండి ...
  Chandrababu Naidu on Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీరుపై మరోసారి నిప్పులు చెరిగారు తెలుగు దేశం పార్టీ అధనేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) . సంక్షేమం పేరుతో అసత్యాలు చేస్తున్న ప్రభుత్వం.. అన్ని వర్గాలను మోసం చేస్తోంది అన్నారు. రాష్ట్రానికి బంగారు భవిష్యత్తుగా భావించే.. యువతకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే..? ఉద్యోగాల భ‌ర్తీపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ (AP CM Jagan) కు లేఖ రాశారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Andhra pradesh Public Service Commission) నోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్‌-1 ఉద్యోగాల అభ్యర్థుల విష‌యంలో అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వీర్యమైనట్లు క‌న‌ప‌డుతోంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది జనవరిలో క్రమం తప్పకుండా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న ప్రభుత్వం హామీ ఎక్కడ ఉందని నిలదీశారు.

  సీఎం జగన్ ఇచ్చిన ఆ  హామీ ఇంకెప్ప‌టి నుంచి అమలవుతుందని మూడేళ్లుగా యువత ఎదురు చూస్తున్నారని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడడం వైసీపీకి అలవాటు అయ్యింది అన్నారు. పాలనను గాలికి వదిలి.. విపక్షాల పైనా.. ఆయా పార్టీల కార్యకర్తలపై కక్ష సాధింపులకే ప్రభుత్వం ఎక్కువ సమయం వెచ్చిస్తోందని మండిపడ్డారు.. అక్రమ కేసులపై పెట్టే ఫోకస్.. యువతకు మంచి చేయడంపై పెట్టాలని చంద్రబాబు సూచించారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్థుల‌ను ఎంపిక చేయడంలో గత మూడేళ్లుగా వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగార్థుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదనను కలుగజేస్తున్నాయ‌న్నారు. 2018లో ప్రకటించిన 165 గ్రూప్‌-1 ఉద్యోగాలకు 2019 డిసెంబ‌రులో రాత‌ పరీక్షలు నిర్వ‌హించి, 2021 మేలో ఫలితాలు ప్రకటించారని.. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీల ప్రకటన నుంచి ఫలితాల విడుదల వరకు అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని.. వాటికి ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.

  ఇదీ చదవండి : ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ షాకిస్తున్న బెంగాల్ టైగర్.. బోనులోకి వచ్చేదెలా..?

  మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారు అంటే.. అవకతవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పరీక్షా పత్రాల మూల్యాంకనం తప్పుడు తడకలుగా జరిగిందని ఆరోపించారు. కేవలం తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు కమిషన్‌ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని అభ్యర్థులు భావిస్తున్నారని.. అయినా దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం మొదటి మూల్యాంకనం, రెండవ మూల్యాంకనం ఫలితాల్లో 15 శాతం తేడా లేనప్పుడు మూడవ మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏంటి? నిల‌దీశారు. తమ అస్మదీయులను అందలం ఎక్కించటం కోసం గ్రూప్‌-1 మెయిన్స్‌లో అక్రమాలకు కొంద‌రు తెరతీశారని ఆయ‌న చెప్పారు.

  ఇదీ చదవండి : వేసవిలో సైతం చల్లని ఆహ్లాదాన్ని పంచే ప్రాంతం.. విశాఖ మణిహారమైన కైలాసగిరికి మరో పేరు ఉందని తెలుసా..?

  ముఖ్యంగా మొదటిసారి విడుదల చేసిన ఫలితాలకు, రెండవసారి విడుదల చేసిన ఫలితాలకు మ‌ధ్య‌ భారీ వ్యత్యాసాలు ఉండడాన్ని తప్పు పట్టారు. ఇది అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యేలా చేస్తోందన్నారు. వెంటనే వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరుతున్న‌ట్లు చంద్ర‌బాబు కోరారు. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపికలో సైతం అక్రమాలు జరిగినట్టు పలువురు అభ్యర్థులు ఫిర్యాదులు చేశారని ఆయ‌న అన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవటంతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, JOBS, TDP

  తదుపరి వార్తలు