హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ChandraBabu: చిత్తూరులో రాజకీయం మారుతోందా..? చంద్రబాబు వ్యాఖ్యలతో ఆ ఇద్దరు మంత్రులు డిఫెన్స్‌లో పడ్డారా?

ChandraBabu: చిత్తూరులో రాజకీయం మారుతోందా..? చంద్రబాబు వ్యాఖ్యలతో ఆ ఇద్దరు మంత్రులు డిఫెన్స్‌లో పడ్డారా?

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu naidu comments on Minsters: ఆ ఇద్దరు మంత్రులు చంద్రబాబు నాయుడ్ని వ్యక్తిగత శత్రువుగానే భావిస్తారు.. అలాంటి ఇద్దరి మంత్రులపై చంద్రబాబుకు సరికొత్త అస్త్రం దొరికిందా..? ఇప్పుడు ఆ మంత్రులు డిఫెన్స్ లో పడ్డారా..? ఇంతకీ ఆ అస్త్రం ఏంటి..?

ఇంకా చదవండి ...

ChandraBabu Naidu vs AP Minster: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సొంత జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓ వైపు చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గంలో ఆయన్ను ఓడించాలని అధికార వైసీపీ (YCP) వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అయితే మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా.. మొత్తం చిత్తూరు (Chitoor) పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఈ సారి జిల్లాపై ఎలాగైనా పట్టుసాధించాలనే కసితో ఉన్నారు. కొత్త కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా టీడీపీ అధినేత వ్యాఖ్యలతో రాజకీయం మరో మలుపు తీసుకుంటుందా అనే ఆసక్తి పెరిగింది. అంతేకాదు కీలకమైన ఆ ఇద్దరు మంత్రులు డిఫెన్స్‌లో పడ్డారా? ఎలా స్పందించాలో తెలియక సైలెంట్‌గా ఉంటున్నారా.. లేక వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? పాచిక పారిందని తెలుగు తమ్ముళ్లు ఆ కామెంట్స్‌ను జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారా? అంటూ చిత్తూరు నేతల్లో ప్రచారం జరుగుతోంది... ఇంతకీ చంద్రాబు నాయుడు చేసిన కామెంట్స్ ఏంటి.. ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అనుకుంటున్నారా..?

చంద్రబాబు నాయుడు ఈ సారి మొదటి నుంచి తన సొంత జిల్లాపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇటీవల తిరుపతి, అన్నమయ్య జిల్లాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికంగా రాజకీయ వేడి రగిలించాయి. అవి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజాలకు తగలడంతో ఆ శిబిరాల్లో కలవరం మొదలైందట.

జిల్లాల విభజన తర్వాత కొన్ని ప్రాంతాల విషయంలో ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నగరిని తిరుపతి జిల్లాలో కలపాలని.. పుంగనూరును అన్నమయ్య జిల్లాల్లో కలపాలనే డిమాండ్‌ ఉంది. ఈ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ఉన్న ఆర్కే రోజా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను ఈ విషయంలో కలిసి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. మంత్రుల నుంచి చూద్దాం.. చేద్దాం అనే మాటలే తప్ప స్పష్టమైన హామీ లేదనే అసంతృప్తి స్థానికుల్లో ఉంది.

ఇదీ చదవండి: ఆ కీలక నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ లేనట్టేనా? అధిష్టానం ఛాన్స్ ఇచ్చేది ఎవరికి?

అందుకే ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు తన వ్యూహంగా మార్చుకున్నట్టు సమాచారం. తన పర్యటనలో దీన్నే ప్రధాన అస్త్రంగా ఆయన వాడినట్టు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతి జిల్లాలో.. పుంగూనురు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలుపుతానని టీడీపీ అధినేత స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో మంత్రులు శిబిరాలు ఇరకాటంలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి : పెళ్లిరోజు నాడే సముద్ర తీరంలో వివాహిత అదృశ్యం.. భర్త పక్కనుండగానే.. పెరుగుతున్న అనుమానాలు?

నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో నగరి, నిండ్ర, విజయపురంలు చిత్తూరు జిల్లాలో.. పుత్తూరు, వడమాలపేట మండలాలు తిరుపతి జిల్లాలోకి వెళ్లాయి. ఆ మూడు మండలాల జనం కూడా తమను తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. పుత్తూరు, వడమాలపేటలు తిరుపతికి దగ్గరగా ఉండటంతో వాటిని ఆ జిల్లాలో కలపడానికి రోజా అభ్యంతరం చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. కానీ.. మిగతా మూడు మండలాల ప్రజలు రివర్స్‌ కావడంతో అధికారపార్టీ వర్గాలకు మింగుడు పడని పరిస్థితి నెలకొందని స్థానిక నేతలే చెబుతున్నారు.

ఇదే అంశంపై పలుమార్లు మంత్రి రోజాను కలిసి విన్నవించారు కూడా. నగరిలో పర్యటించిన చంద్రబాబు ఈ అంశాన్ని రాజకీయంగా వాడేసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నగరి నియోజకవర్గాన్ని మొత్తానికి మొత్తంగా తిరుపతి జిల్లాలో కలుపుతామనే హామీ ఇచ్చారు చంద్రబాబు. దీనికి సానుకూల స్పందన వచ్చిందనే అభిప్రాయంలో పార్టీ వర్గాలు ఉన్నాయి.

ఇదీ చదవండి : ప్రభుత్వ ఆఫీసర్ అంటే ఈమె.. కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన నవ్య

చంద్రబాబు వెళ్లిన తర్వాత కూడా నగరి టీడీపీ ఇంఛార్జ్‌ గాలి భాను ప్రకాష్‌ సైతం ఇదే నినాదంతో నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. ఇక పుంగనూరులోనూ ఇదే తరహా బాణం వేశారు చంద్రబాబు. ఇక్కడ టీడీపీ అధినేతకు రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఉన్నారు. పుంగనూరు ప్రజల కోరిక మేరకు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలుపుతామని చంద్రబాబు చెప్పడంతో.. పెద్దిరెడ్డి టీమ్ అలర్ట్‌ అయిందట. ఇప్పటికైతే ఎలాంటి స్పందన లేకపోయినా.. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు భావిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. పుంగనూరు అజెండా లక్ష్యంగా టీడీపీ ఇంఛార్జ్‌ చల్లా బాబు సైతం ప్రచారం స్పీడ్‌ పెంచారు. మరి ఈ విషయంలో మంత్రులు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి..

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Minister Roja, Peddireddy Ramachandra Reddy, Ycp

ఉత్తమ కథలు