హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: అసెంబ్లీ ఎన్నికల కోసం జగన్, చంద్రబాబు సేమ్ ప్లాన్ ?.. నేతలకు బిగ్ రిలీఫ్

AP Politics: అసెంబ్లీ ఎన్నికల కోసం జగన్, చంద్రబాబు సేమ్ ప్లాన్ ?.. నేతలకు బిగ్ రిలీఫ్

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

Ysrcp-Tdp: ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తామని ఇరు పార్టీలు చెబుతున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎన్నికల్లో గెలుపు కోసం అప్పుడే వ్యూహరచనలో మునిగిపోయాయి. అధికార వైసీపీ(Ysrcp), విపక్ష టీడీపీలు(TDP).. ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాల కోసం వ్యూహకర్తలను నియమించుకున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుని.. నేతల పనితీరు ఏ విధంగా ఉందనే దానిపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటు వైసీపీ, (Ysrcp) అటు టీడీపీ (TDP) రెండూ ఎన్నికల విషయంలో ఒకే వ్యూహాన్ని అనుసరించబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై టీడీపీ, వైసీపీ రెండూ ఒకేలా ఆలోచిస్తున్నాయని టాక్.

  ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటిస్తామని ఇరు పార్టీలు చెబుతున్నాయి.సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పోటీకి కొద్ది రోజుల ముందే ప్రకటిస్తుంటాయి పార్టీలు. టీడీపీ , వైసీపీలు గతంలో ఇలాగే చేశాయి. దీంతో పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో టికెట్ ఆశించే నేతలు.. తమకు టికెట్ వస్తుందా ? లేదా ? అనే అంశంపై టెన్షన్‌తో చచ్చిపోయేవారు.

  అయితే ఈసారి మాత్రం ఏపీలో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి పూర్తిగా ప్రచారంపైనే ఫోకస్ చేయాలని టీడీపీ, వైసీపీ భావిస్తున్నాయి. సీఎం జగన్ కూడా ఇటీవలే ఈ విషయంపై నేతలకు క్లారిటీ ఇచ్చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామందికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలోనే ఉన్న సీఎం జగన్.. పనితీరు బాగోలేని వారిని స్థానాల్లో కొత్తవారికి టికెట్ ఇచ్చే విషయంలో ఏ మాత్రం వెనకాడబోనని స్పష్టం చేశారు.

  Sajjala: హరీశ్ రావుకు ఏపీ ప్రభుత్వం కౌంటర్.. పర్సనల్ సమస్యలు ఉన్నాయేమో అంటూ..

  RK Roja: జగన్ సర్వే రిపోర్ట్.. రోజాకు మళ్లీ నగరిలో కష్టాలు మొదలుకానున్నాయా ?

  మరోవైపు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సైతం చాలావరకు నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల మాత్రం నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. కొత్తవారిని వెతుక్కోవాలా ? అని నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ జనసేనతో పొత్తు ఉన్నా.. లేకపోయినా.. అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం అనుకున్న విధంగానే ముందుకు సాగాలనే ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో చంద్రబాబు, జగన్ ఒకే రకమైన విధానంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu

  ఉత్తమ కథలు