Chandrababu-Pawan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా విపక్షాల పొత్తులు ఎలా ఉంటాయి అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పొత్తుల మీదే ఫలితాలు ఆధారపడతాయని చాలామంది నమ్ముతున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం అదే భావనలో ఉన్నారు.. ఇటు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. అటు జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇద్దరు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అనే అభిప్రాయంలోనే ఉన్నారు.. అందుకు పొత్తులు పెట్టుకోడానికి.. త్యాగాలు చేయడానికి సిద్ధం అనే సంకేతాలు ఇస్తున్నారు ఇద్దరూ.. ఆ మధ్య ఈ విషయంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్.. త్వరలోనే అద్భుతం జరుగుతుంది అన్నారు. ఇప్పుడు అ అద్బుతం ఇదేనా అని సోషల్ మీడియా (Social Media) లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే గంటల వ్యవధిలో ఇటు చంద్రబాబు, అటు పవన్ ఇద్దరూ కేంద్రం తీరుపై ప్రశంసలు కురిపించారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో ప్రశంసలు కురిపిస్తన్నారు. దేశ ప్రజలు, వాహనదారులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఇద్దరు నేతలు.. జగన్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు.
పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించి ప్రజలను ఆదుకున్న కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర స్థాయి పన్నులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పిలుపునివ్వడాన్ని చంద్రబాబు స్వాగతించారు. ఇప్పటికే రాజస్థాన్, ఒడిషా, తమిళనాడు ప్రభుత్వాలు ఇంధనంపై తమ పన్నులను తగ్గించాయని గుర్తు చేస్తున్నారు. మరి ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం దానిని.. ఎందుకు అనుసరించదని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : డ్రైవన్ ను అందుకే హత్య చేశా.. పోలీసుల ముందు సంచలన విషయాలు చెప్పిన ఎమ్మెల్సీ
వచ్చే ఎన్నికలకు బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తుకు అంగీకరించేలా బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని బహిరంగ సభలో పరోక్షంగా పవన్ సూచించారు. తాజాగా ఇంధన ధరలపై కేంద్రం నిర్ణయం తరువాత.. పవన్ స్పందించిన తీరులోనే.. కొన్ని గంటల్లో చంద్రబాబు సైతం అదే వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు స్పందించలేదు.
ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి అన్ని టికెట్లు.. రేపే విడుదల..
మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి) వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. పెరుగుతున్న ధరలతో కష్టాల్లో ఉన్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో ఉపశమనం లభిస్తుందని తాను భావిస్తున్నాను అన్నారు. పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వ అగ్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అన్నారు. ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించదని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు ధరలు తగ్గించడం రాష్ట్ర ప్రభుత్వం వంతు అని చంద్రబాబు, పవన్ ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Pawan kalyan