Kishan Reddy on AP Capital: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం రాజకీయం అంతా రాజధాని చుట్టూనే తిరుగుతోంది. విపక్షాలన్నీ అమరావతి (Amaravati) రాజధాని అంటున్నాయి. కానీ అధికార పార్టీ మాత్రం వికేంద్రీకరణకే మా ఓటు అంటున్నారు. ఎవరు అడ్డుకున్నా మూడు రాజధానులు (Three Capitals) ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని చెబుతూ.. ఇటీవల విశాఖ గర్జన (Visakha Garjana) పేరుతో తమ ఉద్దేశం అందరికీ తెలిసేలా చేసింది వైసీపీ.. మరోవపు మూడు రాజధానులు వద్ద.. అమరావతినే కొనాసాగించాలి అంటూ రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రకు వ్యతిరేకంగానే.. వైసీపీ మహా గర్జన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి తీరుతామని మంత్రులు శపథం చేశారు. ఇలా మూడు రాజధానులే ప్రధాన
అజెండగా వెళ్తున్న వైసీపీ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి షాకిచ్చారు. ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతే కాదు అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ సైతం తనకు చెప్పారంటూ కిషన్ రెడ్డి వెల్లడించారు. అందుకే అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మాత్రం ప్రసక్తే లేదని కిషన్రెడ్డి తేల్చి చెప్పారు. రాజకీయాల్లో పార్టీల మధ్య పోటీ ఉండడం మంచిదే.. అధికారం కోసం అన్ని పార్టీలు కష్టపడాలి తప్పులేదు.. కానీ కక్షసాధింపు చర్యలు ఉండకూడదని హితవు పలికారు. విశాఖలో తాజా పరిణాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు ఏలూరు జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రధాని మోదీ వ్యవసాయ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టారన్నారు. వ్యవసాయదారులకు తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. అయితే రైతులు మూస పద్దతిలో వేసిన పంట మళ్లీ మళ్లీ వేయడంతో గిట్టుబాటు ధర రావడం లేదని.. పంట మార్చి వేస్తే మరింత లాభాలు వస్తాయన్నారు.
ఇదీ చదవండి : మంత్రిపై హత్యకు ప్రయత్నించారా..? సైకో ఫ్యాన్స్ అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు
అలాగే కరోనా సమయంలో రైతు ఇంట్లో కూర్చోకుండా పంట పండించారని.. అందరికంటే రైతు మిన్న అని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని కిషన్రెడ్డి తెలిపారు. విశాఖ ఘటనల నేపథ్యంలో.. ఇతర రాజకీయ పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు అధికార పార్టీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, AP News, Kishan Reddy, Pm modi