హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Central Government: ఆ ఒక్కటి అడగొద్దు.. అన్నీ ఇస్తాం అంటూనే అదే సమాధనం..

Central Government: ఆ ఒక్కటి అడగొద్దు.. అన్నీ ఇస్తాం అంటూనే అదే సమాధనం..

అడిగినది ఏదైనా కుదరందంటున్న కేంద్రం

అడిగినది ఏదైనా కుదరందంటున్న కేంద్రం

No Railway Zone: ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలా అండగా ఉంటాం..? ఏ కావాలో అడగంటి అంటోంది ప్రభుత్వం.. ప్రత్యేక హోదా అంటే.. ముగిసిన అధ్యాయం అంటోంది. పోనీ రైల్వే జోన్ ఏర్పాటు అంటే..? వయబులిటీ లేదంటోంది..? రెవెన్యూ లోటు అంటే.. కష్టం ఇలా.. ఏపీ అడిగిన దేనికైనా నో అంటోంది కేంద్రం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    Central Government: ప్రత్యక హోదా (Special Status) ఏది అంటే ముగిసిన అధ్యాయం అంటోంది.. రైల్వే జోన్ (Railway Zone)  అడిగితే.. వయబులిటీ లేదంటోంది..? పోనీ రెవెన్యూ లోటు సంగతి ఏంటి అంటే.. కష్టం అంటోంది.. పోలవరం ప్రాజెక్టు (Polavaam Project) కు నిధులు అంటే.. లెక్కలు తేలడం లేదని చెబుతోంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ఏం అడిగినా.. కాదు.. లేదు.. కుదరదు అని చెబుతోంది. మరి విభజన హామీల సంగతి ఏంటి అని నిలదీస్తే.. ఏపీకి అన్ని విధాలా అండగా ఉంటాం.. ఏం అడిగినా ఇస్తామని చెబుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) - తెలంగాణ (Telngana) విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన హామీల అమలు,  రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించేందుకు మంగళవారం ఢిల్లీలో సమావేశంలోనూ అదే తీరు కనిపించింది.

    కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో.. సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఏ.పి  ప్రభుత్వం ఏం అడిగినా కేంద్ర ప్రభుత్వం ఆ ఒక్కటి తప్పా.. అంటోంది తప్పా.. దేనిపైనా సరే అని హామీ ఇవ్వలేదు. ముఖ్యంగా విశాఖకు రైల్వే జోన్ లాభదాయకంకాదని అందువల్లనే విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యపడదని రైల్వే అధికారులు కుండబద్దలు కొట్టారని ప్రచారం జరుగుతోంది.

    విభజన హామీల్లో ఉంది కాబట్టే తాము రైల్వేజోన్ కోరుతున్నామని, లాభదాయకం కాదు కాబట్టే తమకు చట్టపరమైన హామీ ఇచ్చారని, లాభనష్టాలతో సంబంధం లేకుండా పూర్తి రాజకీయ కోణంలో అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీ అని, లాభదాయకమైతే రైల్వే సొంతంగా జోన్ ఏర్పాటు చేస్తుందని సి.ఎస్ చెప్పడంతో రైల్వే జోన్ అంశాన్ని క్యాబినెట్ ముందు ఉంచుతామని వారే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని హోం కార్యదర్శి సూచించారట.

    ఏ.పి కి ఇచ్చిన మరో ప్రధానమైన హామీ రాజధాని నిర్మాణానికి ఆర్ధిక సాయం విషయంలోనూ ఒకింత మొండి  చెయ్యే ఎదురైదని సమాచారం. శివరామకృష్ణ కమిటీ సిఫారసు మేరకు రాజధాని నిర్మాణానికి 29వేల కోట్లు ఖర్ఛువుతుందని ఆ మేరకు నిధులు ఇవ్వమని ఏ.పి అధికారులు కోరగా కేంద్ర అధికారులు పెద్దగా స్పందించలేదని తెలిసింది.

    ఐతే కేంద్రం ఇస్తానన్న 2500 కోట్లలో ఇప్పటికే 1500 కోట్లు చెల్లించామని, ముందు ఆ నిధులకు సంబంధించిన లెక్కలు సమర్పిస్తే మిగిన 1000కోట్లు విడుదల గురించి ఆలోచిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారంట. ఇక  షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థలను జనాభా ప్రాతిపదికన పంచాలని ఏ.పి అధికారులు కోరగా దీనికి తెలంగాణ అధికారులు అడ్డు చెప్పారని సమాచారం. ఇక ఆస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని, నగదు ఏమైనా ఉంటే మాత్రం అది జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ విషయంలో మార్పుచేయటం కుదరదని తెలంగాణ అధికారులు తేల్చిచెప్పారు.

    ఇదీ చదవండి : కలెక్టర్ కే షాక్ ఇచ్చిన కేటుగాళ్లు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    ఇక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పన్నుల రిఫండ్ లు ఎక్కువ తెలంగాణకు పోతున్నాయని, ఏ,పి మాత్రం అప్పుల భారం మోయవలసి వస్తోందని ఆ మేర చట్టంలో మార్పులు చేయాలని ఏ.పి అధికారులు కొరగా ఎప్పుడో 8 ఏళ్ళ క్రితం ఏర్పడిన చట్టాన్ని మార్చడం కుదరదని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి : నూతన పరకామణి‌ భవనం ప్రారంభం.. నుదుట తిరునామం, సాంప్రదాయ వస్త్రాలతో కొత్త లుక్కులో సీఎం జగన్

    వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు అడుగగా ఇప్పటికే హామీ ఇచ్చిన మేరకు నిధులు ఇచ్చామని పైగా నీతి ఆయోగ్ కూడా ఐదేళ్ళ కాలానికి మాత్రమే సిఫారుసు చేసిందని తాము 1750 కోట్ల నిధులను విడుదల చేస్తే రాష్ట్రం 1050 కోట్లకు మాత్రమే యూజర్ కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిందని మిగిలిన లెక్కలు చెప్పాక ఆవిషయం పరిశీలిద్దామని కేంద్ర అధికారులు తెలియచేశారు.

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Central governmennt

    ఉత్తమ కథలు