హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన..ఎన్ని మీటర్లంటే?

Ap: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన..ఎన్ని మీటర్లంటే?

పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫోటో)

పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫోటో)

Polavaram Project Height: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎంత ఎత్తంటే?

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Polavaram Project Height: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం రిజర్వాయర్ పూర్తి ఎత్తు 45.72 మీటర్లని పేర్కొంది. అలాగే తమకు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని ఎలాంటి సమాచారం రాలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈరోజు పార్లమెంట్ లో ఈ విషయం ప్రస్తావనకు రాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మరోవైపు పోలవరం ముంపుపై కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. తుది నివేదికకు 3 నెలల సమయం కావాలని ఈ మేరకు కోరింది.

ఇదిలా ఉంటే..ఏపీకి ఇచ్చిన విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదాను కేంద్రం గతంలోనే పక్కనపెట్టింది. ఏపీ సహా దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని అనేక సార్లు తేల్చి చెప్పింది. తాజాగా ఇదే అంశాన్ని కేంద్రం మరోసారి ఇటీవల రాజ్యసభలో స్పష్టం చేసింది. పంజాబ్‌కు చెందిన ఓ ఎంపీ ప్రత్యేక హోదా(Special Status) అంశం ఉనికిలో ఉందా ? ఉంటే పంజాబ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించారని కోరారు. అయితే దీనిపై స్పందించిన కేంద్రం.. దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని పేర్కొంది. ప్రత్యేక పరిస్థితుల వల్ల గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు హోదా ఇచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం ఉనికిలో లేదని చెప్పింది.

ఇది చదవండి: యువతకు గుడ్ న్యూస్.. మినీ జాబ్ మేళా వివరాలివే..!

జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపినీలో 14వ ఆర్థిక సంఘం తేడా చూపలేదని అభిప్రాయపడింది. 2015-2020 మధ్య పన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచామని వెల్లడించింది. 15వ ఆర్థిక సంఘం కూడా 41 శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందని వివరించింది. ఇక పోలవరం ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే అంశంపై ఏపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం 2024 నాటికి పోలవరం (Polavaram) పూర్తి కావడం కష్టమే అని పేర్కొంది. వివిధ కారణాలతో గడువులోగా పూర్తయ్యే పరిస్థితి లేదని తెలిపింది. ఇప్పటికే పోలవరం నిర్మాణానికి రూ. 13,226 కోట్లు చెల్లించామని తెలిపింది.

తాజాగా పోలవరం ఎత్తు విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Polavaram

ఉత్తమ కథలు