హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: శాశ్వత అధ్యక్షుడు అంటే కుదరదు.. వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్

YS Jagan: శాశ్వత అధ్యక్షుడు అంటే కుదరదు.. వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్

వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

AP Politics: ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎన్నికలు జరగాలని సీఈసీ సూచించింది. ఈ అంశంలో పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిపై మీడియాలో మరోసారి స్పష్టత ఇవ్వాలని సూచించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని అధికార వైసీపీకి షాక్ ఇచ్చింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ (YS Jagan) ఎన్నికల చెల్లదని పేర్కొంది. పార్టీలో శాశ్వత పదవులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) నోటీసులు జారీ చేసింది. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నియమాలకు విరుద్ధమని.. ప్రజాస్వామ్యంలో పార్టీలకు శాశ్వత పదవులు ఉండవని అందులో వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి అనేకసార్లు లేఖలు రాసినా వైసీపీ పట్టించుకోలేదని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎన్నికలు జరగాలని సూచించింది. ఈ అంశంలో పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిపై మీడియాలో మరోసారి స్పష్టత ఇవ్వాలని సూచించింది.

  గత జులైలో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో అప్పటివరకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న జగన్ తల్లి విజయమ్మ ఆ పదవికి రాజీనామా చేశారు. అంతా ఊహించినట్టుగానే ఆమె ఆ పదవికి రాజీనామా చేయడంతో.. పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక దాదాపు లాంఛనమైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక జరిగింది.

  ఇందుకు సంబంధించి పార్టీ నిబంధనల్లో మార్పులు చేసినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ పేరును ప్రకటించారు. అయితే తాజాగా వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ఈ నిర్ణయం చెల్లదని ఆ పార్టీకి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఇక వైఎస్ మిగతా రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్షుల తరహాలోనే ఓ నిర్ణీత కాలవ్యవధి కోసం అధ్యక్షుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది.

  YS Jagan: ఎన్టీఆర్‌పై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అన్ని ఆలోచించిన తరువాతే..

  NTR: వైసీపీ సర్కార్ కు వల్లభనేని వంశీ షాక్.. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ఎమ్మెల్యే.. ఎందుకంటే

  ఆ తరువాత పార్టీలో అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించి.. మరోసారి అధ్యక్షుడు కావాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులపై వైసీపీ స్పందించాల్సి ఉంది. మొత్తానికి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాల్సిన పరిస్థితి రావడం ఆ పార్టీ నేతలు ఊహించని పరిణామమనే చెప్పాలి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆ పార్టీ నేతలు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు