GT Hemanth Kumar, News18, Tirupati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కేబినెట్ లో మార్పులు చేర్పులపై (AP Cabinet Changes) ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. పదవుల కోసం ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు లాబీయింగ్ స్టార్ట్ చేశారు. ఐతే చిత్తూరు జిల్లా (Chittoor District) లో కేబినెట్ కుర్చీల ఆట రసవత్తరంగా సాగుతోంది. గత క్యాబినెట్ విస్తరణలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో పాటుగా అనూహ్య రీతిలో డిప్యూటీ సీఎం గా నారాయణ స్వామి మంత్రి పదవి కైవసం చేసుకున్నాడు. మూడేళ్ళ అనంతరం మల్లి ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. జిల్లా విభజనలో భాగంగా నగరిని చిత్తూరు జిల్లాలో కలిపారు. ఇక రాజంపేట జిల్లాకు వెళ్తుందన్న పుంగనూరును చిత్తూరులో ఉంచారు. దింతోఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య మంత్రి పదవి కోసం బలమైన పోటీ సాగుతోంది. అందులో రాయలసీమలో బలమైన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే., మాటలు తూటాల్లా పేల్చే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.
సీఎం జగన్ అధికారంలోకి రాగానే ప్రత్యర్థులను మాటల తూటాలతో విరుచుకుపడ్డ రోజాకు మంత్రిపదవి కచ్చితంగా ఇస్తారనే వాదన తెరపైకి వచ్చింది. ఎటుచూసినా రోజాకు హోమ్ శాఖ ఇస్తారా., మరేదైనా పెద్ద శాఖ రోజాకు కట్టబెట్టారని టాక్ బాగా నడించింది. 25 మంది మంత్రులతో క్యాబినెట్ ఏర్పాటు చేసిన చేసిన సీఎం జగన్.. రోజాకు మాత్రం తన మొదటి క్యాబినెట్ చోటు ఇవ్వలేదు. ఇందుకు కుల సమీకరణాలు ఓ కారణమయితే... 2019 ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కోవడంలో తనదైన పాత్ర పోషించిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చిత్తూరు జిల్లాలో ఉండటం మరో కారణం.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయితీ రాజ్, గనుల శాఖా మంత్రిగానూ, రిజర్వేషన్ కోటాలో అనూహ్యంగా నారాయణ స్వామికి డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖా మంత్రిగా పదవి బాధ్యతలు అప్పగించారు. దీంతో పెద్దిరెడ్డి తనతో పాటు తన వర్గానికి సంబంధించిన నేతకు మంత్రి పదవి దక్కేలా చేసి రోజాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారనే గుసగుసలు పార్టీ వర్గాల్లో బలంగా వినిపించాయి. దీంతో బుజ్జగింపు చర్యగా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా పదవి ఇచ్చారు. ఐతే ఆ పదవిపై అంతగా ఆసక్తి చూపని రోజా... బాధ్యతలను కూడా లైట్ తీసుకుననారన్న ప్రచారం జరిగింది. ఐతే ఆమెను పదవి నుంచి తొలగించడంతో తనకు వచ్చే క్యాబినెట్ కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని సీఎం వద్ద భీష్మించుకొని కుర్చున్నారట రోజా. సరే చూదాం అంటూ జగన్ హామీ ఇవ్వడంతో రోజాకి ఈ సరి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదవి కచ్చితంగా ఇస్తారని.. అందులోనూ హోంశాఖను ఇప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం విభజించిన జిల్లాలో నగరి, పుంగనూరు నియోజకవర్గాలు రెండు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. పార్టీ గెలుపుకోసం, కుప్పంలో టీడీపి, చంద్రబాబు ఓటమి కోసం పావులు కదుపుతున్న పెద్దాయనను కాదని రోజాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశమే లేదని పార్టీలోనే కాకుండా, జిల్లా వాసుల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ నగరిని బాలాజీ జిల్లాలో చేర్చిన రిజర్వేషన్ల ప్రకారం రోజాకు సామజిక వర్గం అడ్డు వస్తుందట. అంతే కాదు బాలాజీ జిల్లాలో సైతం తన వర్గానికి చెందిన నేతకే మంత్రి పదవి ఇవ్వాలని పెద్దిరెడ్డి బలంగా ఒత్తిడి తెస్తున్నారట. ఈ సమీకరణాలు చూస్తే అసలు రోజాకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ తక్కువని అంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ నేతలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, MLA Roja, Peddireddy Ramachandra Reddy