Home /News /andhra-pradesh /

AP POLITICS BUMPER OFFER TO JR NTR AND RAMCHARAN FANS WHO WILL BE BOOK A DOUBLE CYLINDER GAS THEY GET FREE TICKETS NGS

RRR: ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. గ్యాస్ బుక్ చేసుకోండి.. లక్కీ ఛాన్స్ మీదే

ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు బంపర్ ఆఫర్

ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు బంపర్ ఆఫర్

RRR: సినిమా రిలీజ్ కు ముందే రికార్డులకు క్రియేట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మేనియా అప్పుడే మొదలైంది. ఓ గ్యాస్ ఏజెన్సీ అయితే నందమూరి, మెగా అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మా గ్యాస్ బుక్ చేసుకోండి లక్కీ ఛాన్స్ కొట్టేయండి అంటోంది..

    Bumper Offer to JR NTR, Ram Charan Fans:  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ (RRR Movie).. ఇటు నందమూరి..అటు మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్ది.. చిత్రంపై మరింత క్రేజ్ పెరుగుతుంది. బాహుబలి రికార్డులు (Bahubali Records) బద్దలు కావడం ఖాయమనే చర్చ అప్పుడే మొదలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఆర్ఆర్ఆర్ సినిమా చర్చే జరుగుతోంది. అందుకే రిలీజ్  కంటే ముందుగానే ఎన్నో రికార్డులకు ఈ సినిమా వేదిక అవుతోంది. ఇక రిలీజ్ అయిన తరువాత ఎలాంటి హంగామా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (JR NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులను దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఎంత వరకు బ్యాలెన్స్ చేసిన చూపిస్తాడా అన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. అయితే ఈ ఆర్ఆర్ఆర్ కు ఉన్న క్రేజ్ ను కొందరు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ బంపర్ ఆఫర్ లు ప్రకటిస్తున్నారు.

    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. ఈ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ బుకింగ్స్ అప్పుడే ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తొలి వారం టికెట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఏ రకంగా టికెట్ బుక్ చేసుకుందామన్నా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు కారణం నందమూరి, మెగా అభిమానులతో పాటు ఇతర ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే అంత డిమాండ్ కనిపిస్తోంది. టికెట్ల అమ్మకాలు మొదలైన దగ్గర నుంచే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు ఏ సినిమాకు కనిపించని పోటీ ఆర్ఆర్ఆర్ కు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు ఆర్.ఆర్.ఆర్ మూవీ క్రేజ్‌ను ఇష్టాను సారం వినియోగించుకుంటున్నారు.

    ఇదీ చదవండి : సామాజిక వర్గాల వారిగా జాబితా ఖరారు.. ఏపీలో కొత్త మంత్రులు వీరే..

    తాజాగా గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ సినిమా పేరుతో ఓ ఆఫర్ ప్రకటించింది. చాలా వినూత్నంగా ఆలోచించింది. సింగిల్ గ్యాస్ సిలిండర్ కలిగిన వినియోగదారులు.. మరో సిలిండర్ తీసుకుంటే ఉచితంగా ఆర్.ఆర్.ఆర్ మూవీ టిక్కెట్లు ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. దీంతో కొందరు అభిమానులు సిలిండర్‌ కొనుగోలుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే కొందరు వినియోగదారులు సిలిండర్లు బుక్‌ చేసుకున్నారని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Jr ntr, Mega power star ram charam, RRR, RRR for ugadi 2022, RRR release date, SS Rajamouli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు