తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఏపీలోనూ తన పార్టీని విస్తరించేందుక వ్యూహరచన చేస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను(Thota Chandrashekar) నియమించారు. సంక్రాంతి తరువాత ఏపీలో బీఆర్ఎస్‌ను విస్తరించే కార్యక్రమాలపై కేసీఆర్ (KCR) ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. కేసీఆర్ సైతం ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఏపీలోని పలు కీలక అంశాలపై కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ వైఖరి ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. అందులో కొన్ని అంశాలు ఏపీ, తెలంగాణ రెండింటి మధ్య సమస్యలు కాగా.. కొన్ని పూర్తిగా ఏపీకి సంబంధించిన అంశాలు. ఏపీకి సంబంధించిన అంశాల్లో ఏపీ రాజధాని అంశం అత్యంత కీలకమైనది. ఏపీ రాజధానిగా అమరావతి (Amaravati) మాత్రమే ఉండాలని టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీలు పట్టుపడుతుంటే.. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయనే నిర్ణయంతో అధికార వైసీపీ ముందుకు సాగుతోంది.
మరో మూడు నెలల తరువాత పాలన రాజధానిగా విశాఖ మారుతుందని వైసీపీ నేతలు, మంత్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వనున్న బీఆర్ఎస్.. ఈ విషయంలో ఎలాంటి వైఖరితో ముందుకు సాగనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ అంశాలపై ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఎక్కువమంది కోరుకుంటున్నట్టుగా అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఇదే అభిప్రాయానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ విషయంలో తోట చంద్రశేఖర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని.. అమరావతి వైపు కేసీఆర్ మొగ్గు చూపడం వల్లే తోట చంద్రశేఖర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని పలువురు చర్చించుకుంటున్నారు.
PM Narendra Modi: తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ..? ఆ సీటుపైనే బీజేపీ ఫోకస్..!
KTR: 14 మంది ప్రధానులు కంటే ఎక్కువ అప్పు చేసిన నరేంద్రమోదీ.. మండిపడ్డ కేటీఆర్
మరోవైపు ఏపీలోని విపక్షాలన్నీ రాజధాని విషయంలో అమరావతి వైపే ఉన్నాయని.. ఇప్పుడు ఏపీలో ఎంట్రీ ఇవ్వనున్న బీఆర్ఎస్ కూడా అమరావతి వైపు మొగ్గు చూపడం టీడీపీ సహా విపక్షాలకు కలిసొచ్చే అంశమనే టాక్ వినిపిస్తోంది. అయితే రాజధాని విషయంలో కేసీఆర్ కేవలం ఓ నిర్ణయం తీసుకుని ఊరుకుంటారా ? లేక ఈ విషయంలో అధికార వైసీపీని టార్గెట్ చేసే విధంగా వ్యవహరిస్తారా ? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, CM KCR