P Anand Mohan, Visakhapatnam, News18. Brother Anil Meeting: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో కొత్త పార్టీ పుట్టుకొస్తోందా..? సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కుటుంబం నుంచే పార్టీ వస్తోందా..? ఒకప్పుడు జగన్ వదిలిన బాణంగా చెప్పుకొనే.. వైఎస్ షర్మిల (YS Sharmila) ఇప్పుడు సొంతంగా తెలంగాణ (Telnagana) లో పార్టీ పెట్టింది. ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేస్తోందా.. దీనిపై ప్రచారం జరుగుతున్న సమయంలో.. బ్రదర్ అనిల్ (Brother Anil) వరుస ఏపీలో సమావేశాలు నిర్వహిస్తుండడం.. ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. తాజాగా విశాఖ (Visakkha)లో అనిల్ కుమార్ పర్యటించారు. అయితే వైసీపీని గెలిపించిన వర్గాలకు.. ఇప్పుడు అన్యాయం జరుగుతోందని.. అందుకే వారి సమస్యలు చెప్పుకుంటానని .. అందర్నీ కలుస్తున్నానని బ్రదర్ అనిల్ చెప్పుకొచ్చారు.. అయితే సమావేశం ఉద్దేశం ఏదైనా.. త్వరలో పార్టీ పెడతారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో విశాఖలో జరిగిన సమావేశంలో రచ్చ రచ్చ అవ్వడం హాట్ టాపిక్ అవుతోంది..
ఆరంభ సమావేశాల్లోనే.. లొల్లి మొదలవ్వడం.. రాజకీయ పార్టీ పేరు కూడా పెట్టకముందే..? అప్పుడే రాజకీయాలు, గ్రూపులు మొదలవ్వడం పై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బీసీ, ఓసీ, మైనార్టీ అంటూ అక్కడ విభజన మొదలైపోయింది. విశాఖలో అనిల్ కుమార్ పర్యటనలో రెండుగా చీలిపోయిన గ్రూపుల్ని అప్పటికే మీడియా గమనించేసింది. ప్రధాంగా ఉత్తరాంధ్రకి చెందిన ఈ సంఘంలో కొందరు నేతలు.. వైసీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తే.. మరికొందరు అనిల్ కుమార్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి : అసెంబ్లీలో జగన్ లెక్కలపై టీడీపీ జోకులు.. నేతల సస్పెన్షన్ పై ఆగని దుమారం
క్రైస్తవ సంఘాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బ్రదర్ అనిల్.. సామాజిక సేవకుడిగా.. దేవుడి ప్రతినిధిగా.. వైఎస్ కుటుంబ సభ్యుడిగా.. వైఎస్ షర్మిల భర్తగా. సీఎం జగన్ కు బావగా.. ఇలా తెలుగు ప్రజలందరికీ బ్రదర్ అనిల్ సుపరిచితమే.. అలాంటి ఆయన ప్రస్తుతం ఏపీలో వరుసగా పర్యటనలు రాజకీయంగా చర్చ జరుగుతోంది. వరుసగా పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఆకస్మికంగా రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లితో సమావేశమై సుదీర్ఘ చర్చలు చేసారు. అందులో రాజకీయంతో పాటుగా కుటుంబ వ్యవహారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం విజయవాడలో పలు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనిల్ కొత్తగా పార్టీ ఏర్పాటు దిశగా మంతనాలు చేస్తున్నారనే ప్రచారం సాగింది.
ఇక తాజాగా విశాఖలో అనిల్ ఓ హోటల్ లో సమావేశమయ్యారు. క్రైస్తవ సంఘాల పెద్దలందరితోనూ మీటింగ్ పెట్టారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఈ సమావేశం సాగింది. మధ్యలో మీడియాతో మాట్లాడిన అనిల్ రాజకీయ పార్టీ ఏర్పాటు పై స్పష్టత ఇచ్చారు. పార్టీ ఏర్పాటు అంటూ వస్తున్న వార్తల్ని ఖండించారు. ఎస్సీ..ఎస్టీ..బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యామని చెప్పారు.
ఇదీ చదవండి: సీఎం మోసం ఖరీదు ఎంతో తెలుసా..? శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ లోకేష్ ఫైర్
జగన్ మోహన్ రెడ్డి ఏపీ సిఎం అయిన దగ్గర నుంచీ ఆయన్ని కలవలేదని.. ఆయన్ని కలవాల్సి ఉందన్నారు. అదీ క్రైస్తవ సంఘాల కోసమేనని తేల్చేశారు. మీటింగ్ కి వచ్చిన సంఘాలు ఎన్నికల ముందు వైసీపీకి సహాయం చేసాయని.. అండగా నిలిచాయని చెప్పుకొచ్చారు. వైసీపీ విజయానికి కారకులైన వారికి న్యాయం జరగడం లేదన్నారు. పైరవీలు చేసే వారికే పార్టీలో గర్తింపు దక్కుతుందని వ్యాఖ్యానించారు. వాళ్ల బాధలు వినేందుకే తాను ఉత్తరాంధ్రకు వచ్చానని చెప్పారు. రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ అన్ని సంఘాల నుంచి ఉందని చెబుతూ.. పార్టీ ఏర్పాటు సాధారణమైన విషయం కాదన్నారు.
ఇదీ చదవండి: భక్తులకు అలర్ట్.. తిరుమలలో నయా దందా..? దీక్షితులు, అవధాని పేర్లతో చీటింగ్
ఇక ఇదే సమావేశంలో క్రైస్తవ సంఘాల్లో రెండు గ్రూపులు తయారయ్యాయి. క్రైస్తవ సంఘాలకి చెందిన బీసీ రాష్ట్ర నేత నాగరాజు.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ మాట్లాడారని ఉత్తరాంధ్ర జిల్లాలకి చెందిన ఒక ఓసీ సంఘం క్రైస్తవ నేత చెప్పారు. ఇది ఆక్షేపణీయంగా ఉందన్నారు. ఆయన మీడియాతో బాహటంగా విషయాన్ని చెప్పారు. పార్టీని ఏర్పాటు చేసే ఉద్దేశ్యముంటే చెప్పాలని.. అప్పుడే జగన్ ను వ్యతిరేకించడమో.. స్వాగతించడమో చేయాలన్నారు. అంతే తప్ప.. ఇలా ఏపీ సీఎంకి వ్యతిరేకంగా మీటింగ్ లలో మాట్లాడి.. పరువు తీసుకోవద్దని అన్నారు. పార్టీ ఏర్పాటు పై అనిల్ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు కాబట్టీ.. ఇలాంటి ఆరోపణలు వద్దని ఆ నేత మాట్లాడారు. అయితే ఆరంభ సమావేశాల్లోనే ఇలా రచ్చ రచ్చ అవ్వడంతో.. భవిష్యత్తులో బ్రదర్ అనిల్ ఎలా ముందుకు వెళ్తారన్నది చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Vizag, YS Sharmila