హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ మంత్రిపై విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ఏపీ మంత్రిపై విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కొడాలి నాని(ఫైల్ ఫోటో)

కొడాలి నాని(ఫైల్ ఫోటో)

స్వతహాగా క్రిస్టియన్ అయిన జగన్..ఇతర మతాల్ని కూడా గౌరవించాలంటున్నారు. కోట్ల మంది భక్తులు మనోభావాల్ని దెబ్బతీసేలా నాని మాట్లాడారంటూ మండిపడ్డారు.

ఏపీ మంత్రికి షాక్ తగిలింది. తిరుమల ఆలయంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొడాలి నానిపై విజయవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందూ దేవాలయల్ని కించపరిచే విధంగా రాజకీయాలు చేస్తున్నారంటూ బ్రహ్మాణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్వతహాగా క్రిస్టియన్ అయిన జగన్..ఇతర మతాల్ని కూడా గౌరవించాలంటున్నారు. కోట్ల మంది భక్తులు మనోభావాల్ని దెబ్బతీసేలా నాని మాట్లాడారంటూ మండిపడ్డారు. కొడాలి చేసిన వ్యాఖ్యలకు గాను తిరుమల శ్రీవారి పాదాలపై పడి యావత్ హిందూ జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీలో బ్రహ్మాణ సంఘాలన్ని ముందుకువచ్చి మంత్రిపై ఫిర్యాదులు చేస్తున్నారన్నారుజ విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో మంత్రి కొడాలి నానిపై బ్రహ్మాణ సంఘాలన నేత వేమూరి ఆనంద సూర్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ తిరుమలకు వెళ్లిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తిరుపతిలో బీజేపీ నేతలు కూడా ఇప్పటికే నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Kodali Nani, Tirumala Temple, Tirumala tirupati devasthanam

ఉత్తమ కథలు