హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రోజాకు పోటీగా ప్రియారామన్... బీజేపీ భారీ స్కెచ్ ?

రోజాకు పోటీగా ప్రియారామన్... బీజేపీ భారీ స్కెచ్ ?

రోజా (ఫైల్ ఫోటో)

రోజా (ఫైల్ ఫోటో)

Ysrcp mla Roja | ఇప్పటికే పీలేరు,చంద్రగిరి నియోజకవర్గాల్లోని బలమైన టీడీపీ నేతలను తమ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టిన బీజేపీ... జిల్లాలో వైసీపీ కీలక నేతగా ఉన్న రోజాపై పోటీ చేయించేందుకే బహుబాషా నటి ప్రియారామన్‌ను రంగంలోకి దింపారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలమైన రాజకీయశక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ... అందుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓ వైపు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్న కీలక నాయకులను పార్టీలో చేర్చుకుంటూనే... మరోవైపు నియోజకవర్గస్థాయిలో బలమైన నేతలకు కాషాయ కండువా కప్పుతోంది. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో బలమైన నేతను గుర్తించి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీజేపీ నేతలు...చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇప్పటికే పీలేరు,చంద్రగిరి నియోజకవర్గాల్లోని బలమైన టీడీపీ నేతలను తమ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టిన బీజేపీ... జిల్లాలో వైసీపీ కీలక నేతగా ఉన్న రోజాపై పోటీ చేయించేందుకే బహుబాషా నటి ప్రియారామన్‌ను రంగంలోకి దింపారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  తమిళ, మలయాళ భాషల్లో ఎక్కువగా పాపులర్ అయిన ప్రియారామన్‌ను ఆయా రాష్ట్రాల్లో కాకుండా ఏపీ నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది బీజేపీ. అందులోనూ చిత్తూరు జిల్లాలో ఆమె ఎంట్రీ ఇచ్చారు. అయితే బీజేపీలో చేరడానికి ముందే ప్రియారామన్‌కు రోజాపై పోటీ చేసే విషయంలో బీజేపీ క్లారిటీ ఇచ్చినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆమె ఇప్పటికే నగరి నియోజకవర్గంలో పర్యటించారని తెలుస్తోంది. ప్రియారామన్ పోటీ చేస్తే.. నగరి నియోజకవర్గంలోని తమిళ ఓటర్లను కూడా ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీ కీలక నేత రోజాను బీజేపీ నిజంగానే టార్గెట్ చేసిందా ? ఇందుకోసమే ప్రియారామన్‌ను బరిలోకి దింపిందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Chittoor, MLA Roja, Nagari, Ysrcp

  ఉత్తమ కథలు