హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP BJP: ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం.. గోదావరి గర్జనకు సిద్ధం..

AP BJP: ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహం.. గోదావరి గర్జనకు సిద్ధం..

సోము వీర్రాజు

సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బలపడేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్న బీజేపీ (BJP).. త్వరలోనే రంగంలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda).. ఏపీలో పర్యటించనున్నారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బలపడేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్న బీజేపీ (BJP).. త్వరలోనే రంగంలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda).. ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 6న రాష్ట్రానికి రానున్న నడ్డా.. బీజేపీ శక్తి కేంద్రాలను సందర్శించనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. నడ్డా రాక సందర్భంగా గోదావరి గర్జన పేరుతో రాజమండ్రిలో భారీ బహిరంగ సభ కోసం బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ ద్వారా గోదావరి జిల్లాల్లో పట్టు పెంచుకోవాలని బీజేపీయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని సోము తెలిపారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన సోము.. గోదావరి గర్జన పోస్టర్ రిలీజ్ చేశారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుది డబుల్ స్టాండ్ అని ఆయన విమర్శించారు.

  ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసి తీరుతుందని.. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. బద్వేలు, తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేశామని.. ఆత్మకూరులో కూడా బరిలో దిగుతామన్నారు. గౌతమ్ రెడ్డి అంటే తమకు అభిమానం ఉందని.. కానీ అభిమానం వేరు రాజకీయం వేరని చెప్పారు. ఏపీలో నిజమైన రాజకీయ ప్రతిపక్షం బీజేపీనేన్న సోము వీర్రాజు.. చంద్రబాబుది డబుల్ స్టాండ్ పాలిటిక్స్ అని విమర్శించారు.

  ఇది చదవండి: వివేకా కేసులో ఊహించని ట్విస్ట్.. అల్లుడు, కూతురిపై కేసు


  ప్రధాని మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుందని.. 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. మోదీ ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించింది తప్ప.. అవినీతికి చోటులేదన్నారు. అవినీతి ఉన్న రాష్ట్రాలలో అబివృద్ది లేదని.., ఇందజుకు ఏపీనే ఉదాహరణ అని ఆరోపించారు. రాష్ట్రం అబివృద్ది జరగాలంటే మోదీ ఆలోచనలు ఉన్న ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఏపీ అంటే మోదీకి ప్రత్యేక అభిమానం ఉందని.. అందుకే NREGS కింద రూ.70 వేల కోట్లు ఇచచారన్నారు. ఆయస్మాన్ భవ ఆద్వర్యంలో ఆరోగ్యకేంద్రాలను ఎర్పాటు చేసి రూ.6700 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ అని పేరుపెట్టుకుందన్నారు.

  ఇది చదవండి: విశాఖపై టీడీపీ కీలక నిర్ణయం..? ప్లేస్ మారనున్న బాలయ్య చిన్నల్లుడు..?


  రాష్ట్రంలో 53 లక్షల మందికి E శ్రమ్ కార్డులు ఇచ్చారన్నారు. జనధన్ పధకం, ఆత్మ నిర్బాన్ పధకం, ప్రధానమంత్రి మాతృవందన పధకం, సుజన యోజన పధకం క్రింద LED బల్బులు, ప్రదానమంత్రి ఉజ్వల యోజన క్రింద గ్యాస్ కనెక్షన్స్, పీఎం ఆవాస్ యోజన పథకం క్రింద 20లక్షలు ఇళ్లు, సుకన్య యోజన, ఈనమ్ మార్కెట్ సెంటర్స్, జలజీవన్ పథకం, పీఎం కేర్స్ కింద కొవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్ధిక సాయం చేస్తున్నామన్నారు సోము వీర్రాజు.

  ఇది చదవండి: ఏపీలో వాళ్లకే బీపీ ఎక్కువ.. సర్వేలో షాకింగ్ నిజాలు


  కేంద్ర పథకాలన్నీ ప్రజలకు అందజేయడంతో జగన్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని సోము వీర్రాజు మండిపడ్డారు. నవరత్నాలు కంటే మేలైన పథకాలను కేంద్రం అందిస్తోందని ఆయన గుర్తుచేశారు. అమలాపురంలో అల్లర్లకు ప్రతిపక్ష పార్టీలు కారణం కాదని.. రాజకీయ లబ్ధికోసమే వైసీపీ అలా చేయించిందన్నారు. అంబేద్కర్ పేరుపై బీజేపీ ఎక్కడా వ్యతిరేకత చూపలేదన్నారు. అమలాపురంలోనే వ్యతిరేకత ఎందుకొచ్చిందో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, Somu veerraju

  ఉత్తమ కథలు