Home /News /andhra-pradesh /

AP POLITICS BJP TO ANNOUNCE JANASENA CHIEF PAWAN KALYAN AS THEIR CM CANDIDATE FOR 2024 ASSEMBLY ELECTIONS FULL DETAILS HERE PRN GNT

Pawan as CM Candidate: సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్..! బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ..? త్వరలో కీలక ప్రకటన..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (ఫైల్)

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు మందుకు వేస్తున్న జనసేన (Janasena), బీజేపీ (BJP) పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. రెండు పార్టీలు పొత్తులో ఉన్నా.. కేడర్ మాత్రం కలవడం లేదు. నేతలు కూడా ఎవరిదారివారే అన్నట్లుగా ఉన్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జనసేన (Janasena), బీజేపీ (BJP) పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. రెండు పార్టీలు పొత్తులో ఉన్నా.. కేడర్ మాత్రం కలవడం లేదు. నేతలు కూడా ఎవరిదారివారే అన్నట్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీపై దృష్టిపెట్టిన బీజేపీ అధిష్టానం.. త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. జనసేన - బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెల 6న ఏపీ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నడ్డా పర్యటన తర్వాత 2024 ఎన్నికలే లక్ష్యంగా రోడ్ మ్యాప్ విడుదల చేయనున్నారు.

    బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ కు అనుగుణంగా రెండు పార్టీలు కలిసి జిల్లాల్లో బహీరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలకు జేపీ నడ్డాతో పాటు అమిత్ షా కూడా వస్తారని బీజేపీ వర్గాలంటున్నాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా జనసేన-టీడీపీ పొత్తుపెట్టుకోబోతున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై జనసేన కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిందని..అందుకే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    ఇది చదవండి: ముందస్తు ఎన్నికలకు సిద్ధం.. మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..


    అంతేగాక జనసేన-బీజేపీ కూటమిలోకి టీడీపీని రానివ్వడం బీజేపీకి ఇష్టం లేదని.., అందుకే ముందగానే పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీని అడ్డుకోవచ్చన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇటు జనసనే పార్టీ కూడా అదే కోరుకుంటోంది. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. చివరి నిముషంలో టీడీపీ ఎంటరై కూటమి గెలిచినా తమ నాయకుడు సీఎం అవుతాడని జనసైనికులంటున్నారు.

    ఇది చదవండి: వైసీపీకి ఆదాయం ఎక్కువ... వ్యయం తక్కువ.., టీడీపీ పరిస్థితి రివర్స్..


    ప్రస్తుతం బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేదు. ఉన్నదల్లా జనసేనతో పొత్తు అనే బలమే. అందుకే పవన్ తో పొత్తులో ఉంటే ఏపీలో క్రమంగా పుంజుకోవచ్చని.. పవన్ నుంచి విడిపోతే ఒంటరిగా బరిలో దిగే పరిస్థితి లేదు. అందుకే కూటమి సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ క్లారిటీకి వచ్చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2024లో గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా.. పవన్ తో వెళ్తే తమ గతంలో కంటే మిన్నగా ఫలితాలు వస్తాయని బీజేపీ భావిస్తోంది. పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉమ్మడి కార్యాచరణను అమలు చేయడం ద్వారా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి గట్టి సంకేతాలిచ్చినట్లు అవుతుందనేది బీజేపీ వ్యూహం. ప్రభుత్వ వ్యతిరేకత, పవన్ ఛరిష్మా.. టీడీపీకి ధీటుగా పోటీ ఇవ్వగలుగుతుందని కమలనాథులు భావిస్తున్నారు. మరి జనసేన-బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతోంది..? పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూటమి మరింత దూకుడుగా వెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Bjp-janasena, Janasena party, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు