హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP BJP: అమరావతి కోసం ఏపీ బీజేపీ పాదయాత్ర.. పొలిటికల్ గా వర్కవుట్ అవుతుందా..?

AP BJP: అమరావతి కోసం ఏపీ బీజేపీ పాదయాత్ర.. పొలిటికల్ గా వర్కవుట్ అవుతుందా..?

సోము వీర్రాజు

సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Capital Amaravathi) పరిరక్షణకై ఏపీ బీజేపీ (AP BJP) ముందడుగు వేసింది. ఇందులో భాగంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ‘మనం.. మన అమరావతి’ నినాదంతో బీజేపీ సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర ను చేపట్టింది.

ఇంకా చదవండి ...

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Capital Amaravathi) పరిరక్షణకై ఏపీ బీజేపీ (AP BJP) ముందడుగు వేసింది. ఇందులో భాగంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ‘మనం.. మన అమరావతి’ నినాదంతో బీజేపీ సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర ను చేపట్టింది. ఈ పాదయాత్రలో భాగంగా అమరావతి రాజధాని, రాజధాని నిర్మాణానికి కేంద్ర ఇచ్చిన నిధులు, చేస్తున్న పనులుపై గడప గడపకు ప్రచారం చేయనున్నారు బీజేపీ నాయకులు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో వారం రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఉండవల్లిలో రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాదయాత్రను ప్రారంభించారు. కాగా, ఈ యాత్రలో కేంద్ర, రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొననున్నారు. 4వ తేదీ సాయంత్రం తుళ్ళూరు బహిరంగ సభతో అమరావతి బీజేపీ సంకల్పయాత్ర ముగియనుంది.

మూడు రాజధానుల ప్రకటన అప్పుడు రాజ‌ధానిని మార్చిన‌ప్పుడు ప్రేక్ష‌క‌పాత్ర పోషించి, ఇప్పుడు ఏ ప్ర‌యోజ‌నాల్ని ఆశించి అమ‌రావ‌తిలో పాద‌యాత్ర చేయాల‌ని బీజేపీ సంక‌ల్పించిందోన‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌ని ఆ ప్రాంత వాసులు ఉధృతంగా ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో మాత్రం బీజేపీ అటు వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. సుజ‌నాచౌద‌రి లాంటి ఒక‌రిద్ద‌రు బీజేపీ నాయ‌కులు మాత్రం సామాజిక కోణంలో మాత్ర‌మే రాజ‌ధాని ఎక్క‌డికీ త‌ర‌లిపోద‌ని మాట్లాడారు.

ఇది చదవండి: కాపు ఓట్లను అమ్మేందుకు కుట్ర.. పవన్ పై జగన్ సంచలన కామెంట్స్..


ఎప్పుడో రెండేళ్ల క్రితం రాజ‌ధానిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అప్ప‌టి నుంచి ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తున్న ఆ పార్టీకి ఉన్న‌ట్టుండి, రాజ‌ధానిపై ప్రేమ ఎందుకు పుట్టిందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఏది రాజకీయాలలో భాగంగా వచ్చే ఎన్నికల లో భాగంగా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఈ పాదయాత్ర ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది చదవండి: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 26వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. వివరాలివే..


పాదయాత్ర ను ప్రారంభించిన సోము వీర రాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ఇచ్చిన నిధులు, చేస్తున్న పనులు పై పాదయాత్ర ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. పాదయాత్ర అమరావతి పరిసర ప్రాంతాల లోని సుమారు ఇరవై తొమ్మిది గ్రామాలలో కొనసాగుతుందన్నారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఎపీలో అనేక పరిణామాలు మారాయని ఆనాటి టిడిపి ప్రభుత్వం రైతుల నుండి భూములు సేకరించి రాజధాని నిర్మాణం చేయకుండా వదిలేసిందని విమర్శించారు.

ఇది చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి రోజా.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే గుర్తింపు కార్డులు..


కేంద్రం రాజధాని కోసం ఒకసారి రూ.4 వేల‌కోట్లు, మరోసారి రూ.2,500 కోట్లు నిధులుకేంద్రం మంజూరు చేసిందని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఈ నిధులను అమరావతి స్మార్ట్ సిటీకి డబ్బు వినియోగించ లేదన్నారు. ఇప్పటి సీఎం మాట తప్పను, మడమ తిప్పను అన్నారని.., ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, అమరావతి అభివృద్ధి చేస్తా అని నమ్మించి మాట మార్చాడని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు.రెండు ప్రభుత్వాల వల్లే అమరావతి అభివృద్ధి ఆగిపోయిందని సోము వీర్రాజు విమర్శించారు.

First published:

Tags: Amaravathi, Andhra Pradesh, Ap bjp

ఉత్తమ కథలు