Ap Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. అందుకే వలసల పైనా జోరుగా ప్రచారం సాగుతోంది. కీలక నేతలు కొందరు పార్టీ మారడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీనేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారడం ఖారరైంది. అందుకే సోము వీర్రాజుపై కన్నా బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు.. అయితే బీజేపీకి మిత్రపక్షమైన జనసేనలోకి వెళ్లాలంటే సస్పెన్షన్ చేయించుకోవడం ఒక్కటే మార్గమని కన్నా స్కెచ్ వేసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట.. అయితే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే ఎలాంటి సిగ్నల్ వెళ్తుంది అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ముందుగా కన్నా.. టీడీపీలో చేరుతారనే ప్రచారం ఉండేది. కానీ ఇయన ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు టాక్..
ముఖ్యంగా టీడీపీ-జనసేన దాదాపు పొత్తుపెట్టుకోవడం దాదాపు ఖరారు అయినట్టే.. అయితే బీజేపీ ఈ కూటమితో ఉంటుందా.. ఉండదా అన్నదే తేలాల్సి ఉంది. అందుకే కన్నా ఇంకా తన నిర్ణయం ప్రకటించడం లేదని.. పొత్తుపై క్లారిటి వచ్చిన తరువాత.. ఏ పార్టీలో చేరేది అన్నదానిపై క్లారిటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం పొత్తుల్లోనే ఉన్నా.. జనసేన , బీజేపీ మధ్యన పూడ్చలేని ఆగాధం పెరిగినట్టే కన్పిస్తోంది. ఈ బంధం భవిష్యత్‌లో ఉంటుందో లేదో కూడా ఎవరికీ తెలియదు. దీంతో పక్కదారులు చూసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోందట. జనసేన లేకుండా పోయినసారిలా ఒంటరిగా పోటీ చేయాలనే కాన్సెప్ట్ చాలా మందికి నచ్చడం లేదట. ఈ క్రమంలో కొందరు నేతలు పక్కపార్టీలకు దారులు వెతుక్కుంటున్నారు. ఈ లైనులోనే బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నట్టు టాక్. గతంలో కన్నా నివాసానికి జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెళ్లినప్పుడే.. కన్నా జనసేనలోకి జంప్ అని దాదాపు అందరికీ అర్థమైంది. కన్నాతో నాదెండ్ల భేటీ కావడానికి ముందే సోము వీర్రాజుపై కన్నా గతంలో ఓసారి విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కన్నా-నాదెండ్ల భేటీ జరగడంతో అప్పటి వరకు టీడీపీలోకి వెళ్తారని కన్నా గురించి లెక్కలు వేసుకున్న వారు.. వారి ఆలోచనలను మార్చుకుని జనసేనకు వెళ్తారనే క్లారిటీకి వచ్చారు.
సోము వీర్రాజుతో కన్నాకు గత ఏడాదికి పైగానే పడటం లేదు. పైగా జనసేనతో పొత్తు చివరకు ఏం అవుతుందో తెలియదు. ఇంకోపక్క జనసేననాని నుంచి ఆహ్వానం.. ఇవన్నీ చూసిన కన్నా.. బీజేపీ సేఫ్ కాదనే ఫీలింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన కన్నా.. మరోసారి ఓడటానికి సిద్ధంగా లేరట. అందుకే ఈసారి కచ్చితంగా గెలిచే పార్టీనే చూసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారట. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా ఉండటంతో.. ఆ రెండు పార్టీల మధ్య చేరికల వ్యవహరం సరికాదనే చర్చ ఉంది. మిత్రపక్షమైన బీజేపీ నుంచి సీనియర్ నేత కన్నాను చేర్చుకోవాలంటే నైతికంగా జనసేన ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే పొత్తులపై పూర్తి క్లారిటీ వచ్చిన తరువాతే.. ఆయన అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
అదే బీజేపీనే కన్నాను బయటకు పంపేస్తే.. ఏ పార్టీలో లేని ఆయన్ను చేర్చుకోవడానికి జనసేనకూ ఇబ్బంది ఉండదు. అందుకే కన్నా నేరుగా బీజేపీ ఏపీ చీఫ్‌నే టార్గెట్ చేస్తున్నారట. వారిని వీరిని కాకుండా.. నేరుగా పెద్దాయన మీదే బాణం ఎక్కుపెట్టి తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Bjp-janasena, Kanna laxminarayana