Home /News /andhra-pradesh /

AP POLITICS BJP PROPOSAL TO JANASENA CREATES NEW OPPORTUNITY TO TDP AND CHANDRABABU NAIDU REGARDING ALLIANCE IN ANDHRA PRADESH AK

Chandrababu| Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్లాన్ రివర్స్.. చంద్రబాబుకు అనుకోని అవకాశం ఇచ్చిన బీజేపీ

పవన్ కళ్యాణ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

AP Politics: జనసేన ప్రతిపాదనను బీజేపీ లైట్ తీసుకోవడం టీడీపీకి, చంద్రబాబుకు కలిసొచ్చే అంశమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

    రాజకీయాల్లో ఎంతో వ్యూహత్మకంగా ముందుకు సాగాలి. ఏ మాత్రం తొందరపడినా.. ఆ తరువాత అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏపీలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే చర్చ జరుగుతోంది. పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆ తరువాత బీజేపీకి జనసేన పెట్టిన షరతులపై రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. టీడీపీకి(TDP) పవన్ కళ్యాణ్ పెట్టిన కండీషన్స్‌ను చంద్రబాబు(Chandrababu Naidu) నేరుగా ఖండించకపోయినా.. ఆ పార్టీ నేతలు వీటిని లైట్ తీసుకుంటున్నారు. ఇక బీజేపీ,(BJP) జనసేన(Janasena) తరపున ఏపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్‌ను ప్రకటించాలని జనసేన డిమాండ్ చేసినా.. బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదు.

    దీనిపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని కొందరు.. బీజేపీయేతర వ్యక్తిని సీఎంగా ప్రకటించే అలవాటు తమ పార్టీకి లేదని ఇంకొందరు కామెంట్ చేశారు. దీంతో పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్, జనసేన చేసిన ప్రతిపాదనలేవీ వర్కవుట్ అయ్యే అవకాశం లేదనే విషయం తేలిపోయింది. అయితే జనసేన ప్రతిపాదనను బీజేపీ లైట్ తీసుకోవడం టీడీపీకి, చంద్రబాబుకు కలిసొచ్చే అంశమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో సుముఖంగా ఉన్న జనసేన.. ఈసారి తమకు ఎక్కువ సీట్లతో పాటు పవన్ కళ్యాణ్‌కు పొత్తుల్లో భాగంగా సీఎం సీటు ఇవ్వాలని కోరుతోంది.



    అయితే టీడీపీ నేతలు దీన్ని తిరస్కరిస్తున్నారు. తాజాగా ఏపీలో పెద్దగా బలం లేని బీజేపీ కూడా పవన్ కళ్యాణ్‌ను ఇరు పార్టీల తరపున సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి సిద్ధపడకపోవడంతో.. టీడీపీ ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా బలం లేని బీజేపీనే పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా అంగీకరించకపోతే తాము ఎలా ? ఇందుకు ఒప్పుకుంటామని టీడీపీ ప్రశ్నించవచ్చని తెలుస్తోంది.

    Minister Roja: ఆమె చేతిలో రోజాకు ఓటమి తప్పదా ? అంత సీనుందా ?

    CM Jagan: ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్.. రైతులకు యంత్రాలతో చేయూత.. పొందాడానికి ఏం చేయాలంటే?

    ఇంకా చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్‌ టీడీపీతో పొత్తుల విషయంలో ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా బీజేపీ అవకాశం కల్పించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒకరకంగా టీడీపీకి జనసేన విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై దారి చూపించిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇతర పార్టీలతో పొత్తులతో ముందుకు సాగి ఏపీలో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Bjp, Chandrababu Naidu, Janasena, Pawan kalyan, TDP

    తదుపరి వార్తలు