JP Nadda: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda).. ఇవాళ, రేపు పర్యటించనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా విజయాడ (Vijayawada) లోని సభలో పాల్గొన్న ఆయన.. ఏపీ సీఎం జగన్ (CMJagan) పాలనపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి బీజేపీ (BJP) అవసరం చాలా ఉందన్నారు. బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో నడ్డా పాల్గొని ప్రసంగించారు. అయితే విజయవాడలో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఏపీ అభివృద్ధిపై సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మార్పు కోసం కోరుకునే వారు ఎవైరా బీజేపీ తలుపు తట్టాలని పిలుపు ఇచ్చారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం కృషి చేస్తోందన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో పది వేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయని.. ప్రతి బూత్ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని నడ్డా అన్నారు.
అలాగే కమిటీల ఏర్పాటు ప్రక్రియ నెలలో పూర్తి కావాలని ఆదేశించారు. స్థానిక సమస్యలపై ప్రతి బూత్ కమిటీలో చర్చించాలన్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ పాలనపై ఈ సందర్భం గా విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలని నేతలకు తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను జగన్ సర్కార్ ఆరోగ్యశ్రీగా మార్చిందని అన్నారు. ఆరోగ్యశ్రీ జగన్ పథకం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమని చెప్పుకొచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నజగన్ పై అన్ని వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని నడ్డా అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: యాపిల్ కాదు ఇది మామిడే? సుగర్ కంటెంట్ తక్కువే? ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో?
అలాగే కేంద్రం సౌభాగ్య కార్యక్రమం రెండున్నర కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రయోజనం కల్పిస్తున్నామని జేపీ నడ్డా పేర్కొన్నారు. అయితే ఏపీలో బీజేపీ-జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి సీఎం అభ్యర్థిపైనా పవన్ క్లారిటీ ఇస్తారని.. అంతా భావించారు.. కానీ నడ్డా ఆ టాపిక్ తీయలేదు. దీనిపై ఎంపీ జీవీఎల్ క్లారిటీ ఇచ్చారు.. ఉమ్మడి సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై కేంద్ర పెద్దలు మాత్రమే క్లారిటీ ఇస్తారని.. ఈ రెండు రోజుల పర్యటనలో నడ్డా చెప్పరని జీవీఎల్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 18 రోజులైనా చిక్కని పులి.. తృటిలో తప్పించుకోవడంతో కలవరం.. దాడి చేస్తుందేమోనని భయం భయం
మరోవైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో ఆంధ్ర ప్రదేశ్‌ను అధోగతి పాలు చేశారని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, ఏపీ సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ అరోపించారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపేశారని అభిప్రాయపడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా ఏపీ పర్యటన సదర్భంగా సునీల్ దియోధర్ మాట్లాడారు. జగన్ ఢిల్లీ వెళ్లి వేంకటేశ్వర స్వామి ఫొటో మోదీకి ఇచ్చి, ఆయన ఆశీస్సులు తీసుకున్నా ప్రయోజనం లేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP News, JP Nadda