AP Elections: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి..? సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ముందస్తు కు వెళ్తారా..? లేక రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా..? ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. గెలిచేది ఏ పార్టీ..? సీఎ జగన్ మోహన్ రెడ్డి రెండో సారి సీఎం గా బాధ్యతలు చేపడతారా..? లేక ఆఖరి ఛాన్స్ అనుకుంటున్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు పట్టం కడతారా..? ఈ సారి అధికారం మనదే అంటున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైపు ఓటర్లు మొగ్గుతారా..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఇదే సమయంలో ప్రస్తుతం ఏపీ లో సర్వేల కాలం నడుస్తోంది. పలు ప్రైవేటు సంస్థలు ఎప్పటికప్పుడు తమ సర్వే రిపోర్ట్ లు అందిస్తున్నాయి. అందులో కొన్ని సంస్థలు తెలుగు దేశం పార్టీ అధికారం చేపడుతుందని చెబితే.. కొన్ని వైసీపీకి అనుకూలం అని చెబుతున్నాయి. మరికొన్ని నెక్ టు నెక్ వార్ ఉండొచ్చు అని అభిప్రాయం చెబుతున్నాయి.
ఒక్కొక్కరి రిపోర్ట్ ఒక్కోలా ఉండడంతో ఏ సర్వేను ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అయితే తాజాగా కేంద్రం చేతికి ఏపీ రాష్ట్రానికి సబంధించి సర్వే రిపోర్ట్ కేంద్ర పెద్దల చేతికి చేరింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ రిపోర్ట్ లో ఏముంది..? అధికారం సొంతం చేసుకునే పార్టీ ఏది..? మరి కేంద్రం ఎలా ముందుకు వెళ్లనుంది..? ఈ అంశాలు తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి..
బీజేపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు జరిపిన సర్వేలో.. ప్రస్తుత పరిస్థితులు ఆధారంగా అధికార వైసీపీకే మెజార్టీ ఉందని ఆ నివేదికలో ఉంది అంటున్నారు. బీజేపీ పెద్దలకు అందిన నివేదికలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 90కి దగ్గరగా సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలిందంట..? అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..?
ఇదీ చదవండి : కేబినెట్ నుంచి మంత్రి సీదిరి అవుట్..! సీఎం జగన్ నుంచి పిలుపు.. అందుకేనా?
టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే 80కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ పెద్దలకు చేరిన నివేదికలో ఉంది అంట.. మరి జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తే పరిస్థితి ఏంటి అన్నదారిపై వారు నివేదిక సేకరించలేదు అని తెలుస్తోంది. ఎందుకంటే జనసేన తమతోనే ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అలా కాకుండా.. ఒక వేళ ఎన్నికల సమయంలో బీజేపీని కాదని.. టీడీపీతో పవన్ ముందుకు వెళ్తే పరిస్థితి ఏంటి అన్నది మాత్రం బీజేపీ లెక్కలు వేసుకోవడం లేదని తెలుస్తోంది.
దీనిపై ఏపీ బీజేపీ నేతల సన్నిహితులు ఆరా తీసే ప్రయత్నం చేస్తే.. ప్రస్తుతం బీజేపీ జాతీయ పెద్దలు అంతా కర్ణాటక ఎన్నికలపైనే ఫోకస్ చేశారని.. ఆ ఎన్నికలు అయిన తరువాత.. ఏపీపై పూర్తి స్థాయి ఫోకస్ చేస్తారని.. అప్పటి వరకు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోదని వారు చెప్పినట్టు సమాచారం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Pm modi