Home /News /andhra-pradesh /

AP POLITICS BJP NATIONAL LEADER SUNIL DHEVDHAR STRONG COUNTER TO AP MINSTERS COMMENTS NGS GNT

BJP Vs YCP: జగన్ బెయిల్ ఎప్పుడైనా రద్దు కావొచ్చు..! మంత్రులకు బీజేపీ కౌంటర్

బీజేపీ వర్సెస్ వైసీపీ

బీజేపీ వర్సెస్ వైసీపీ

సీఎం జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దవుతుందని వైసీపీ భావిస్తోందా..? అప్పుల భారంతో పాలన సాగడమే కష్టంగా ఉందని వైసీపీ నేతలు అనుకుంటున్నారా..? ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. బీజేపీ జాతీయ నేత సునీల్ దేవ్ ధర్.. ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  ఏపీ ప్రభత్వం-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. మొన్నటి వరకు రెండు పార్టీలు ఏపీలో రాజకీయంగా మాటకు మాట అనుకున్నా.. జాతీయ స్థాయిలో రెండు పార్టీల మధ్య సఖ్యత ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. రాష్ట్రానికి నిధులు రాకపోయినా.. విభజన హామీలు నెరవేర్చకపోయినా.. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు లేకపోయినా.. కేంద్రాన్ని ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పల్లెత్తు మాట అనలేదు. పైగా ప్రతి సందర్భంలోనూ కేంద్రాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు కేంద్రంతో సఖ్యంగా ఉండి సాధించుకోవాలని.. కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే ఎలా అని సీఎం జగన్ ఇతర సీఎంలకు సూచించిన సందర్భాలు ఉన్నాయి. మోదీకి మద్దతుగా లేఖలు కూడా రాశారు. ఇదంత కొన్ని రోజుల కిందటి ముచ్చట.. కానీ పది రోజుల నుంచి చూస్తే పరిస్థితి పూర్తిగా మారినట్టు కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య ఏదో జరిగింది అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ పార్లమెంట్ వేదికగా వైసీపీ కేంద్రాన్ని వ్యతిరేకించింది లేదు. కానీ తొలిసారి ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా గొంతు విప్పింది. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలను అజెండాగా పెట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. అదికూడా మోదీ సభలో ఉండాగానే వెల్ లోకి వెళ్లి నిరసనలు తెలిపింది.. ఇక పార్లమెంట్ బయట కూడా మాటల దాడి ఆపలేదు. కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విజయసాయి రెడ్డి ఇతర ఎంపీలు విమర్శలు చేశారు. స్పీకర్ పక్షపాత ధోరణిలో ఉన్నారంటూ విమర్శలు చేశారు. అప్పటికే చర్చ మొదలైంది. వైసీపీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటూ అందరిలో అనుమానాలు పెంచినా.. అదంతా పొలిటికల్ డ్రామా అయి ఉంటుంది లే అనుకున్నారు. కానీ తాజా ఘటనలు మాత్రం రెండు పార్టీల మధ్య పూడ్చలేనంత గ్యాప్ పెరిగి ఉంటుందనే అనుమానాలు కలిగిస్తున్నాయి..

  తాజాగా ఏపీ కేబినెట్ భేటీలో సైతం బీజేపీ తీరుపై సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం అందుకు నిదర్శనం.. ముఖ్యంగా ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ఆయన ప్రస్తావించారు. వారి ఇద్దరి విమర్శలకు ఎందుకు కౌంటర్లు ఇవ్వడం లేదని నిలదీశారు. మన రాష్ట్ర అప్పులు గురించి కేంద్రానికి ఎందుకు అని ప్రశ్నించారు. అసలు మంత్రులు ఎందుకు బీజేపీ నేతలను విమర్శించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వెంటనే మంత్రి పేర్ని నేని మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర చేస్తోంది అన్నారు. జగన్ దింపేయడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అక్కడ నుంచి మంత్రులు అంతా బీజేపీ నేతలపై స్వరం పెంచారు..

  తాజాగా బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో దూకుడు పెంచారు. మంత్రుల వ్యాఖ్యలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా జాతీయ నేత సునీల్ దేవ్ దర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చాల్సిన అవసరం లేదన్నారు. ఆ ఆలోచన కూడా తమకు లేదన్నారు. అక్కడితోనే ఆగక.. ఏ క్షణాన జగన్ బెయిల్ రద్దు అవుతుందో తెలియక.. రోజు గడవడానికి అప్పు పుట్టక, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టి... అది చాలదన్నట్టు వేల కోట్ల అవినీతి చేసి.. మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోటు గొయ్యి తవ్వి రెడీగా ఉంచారు అంటూ కౌంటర్ ఇచ్చారు.. http://  ఇలా రెండు పార్టల నేతల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. అయితే ఈ గ్యాప్ కు మాత్రం రఘురామ ఇష్యూనే ప్రధాన కారణమై ఉండొచ్చని రాజకీయా వర్గాలు అంటున్నాయి. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఈ నెల 25న తుది తీర్పు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే తీర్పు ఎలా వచ్చినా.. సీబీఐ సరైన వాదనలు వినిపించలేదని.. ఇదంతా కేంద్ర పెద్దలకు తెలిసే జరుగుతోందని ప్రచారం ఉంది. మరోవైపు వైఎస్ వివేకానంద హత్య కేసులో కూడా సీబీఐ దూకుడుగానే వెళ్తోంది. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య గ్యాప్ వచ్చి ఉండొచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు పీకే బీజేపీకి వ్యతిరేక కూటమికి పని చేస్తూ ఉండడం.. పీకేతో జగన్ కు సాన్నిహిత్యం ఉండడం కూడా ఈ రెండు పార్టీల మధ్య విబేధాలకు కారణం కావొచ్చు అంటున్నారు..
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, Ap minister perni nani, AP News, AP Politics, Ycp

  తదుపరి వార్తలు