Home /News /andhra-pradesh /

AP POLITICS BJP NATIONAL HICOMMAN ALSO GIVE ROUTE MAP FOR PAWAN KALYAN AND THEY GAVE CLARITY ON CHANDRABABU NGS

Pawan kalyan: పవన్ కు రూట్ మ్యాప్ ఇచ్చిన బీజేపీ.. టీడీపీ విషయంలో ఏం చెప్పిందంటే?

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

BJP Route Map: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతికి.. బీజేపీ పెద్దలు రూట్ మ్యాప్ ఇచ్చారా..? ఆ రూట్ మ్యాప్ లో పొత్తులపై ఏం చెప్పారు.. టీడీపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..? సీఎం అభ్యర్థి ప్రకటనపై బీజేపీ కామెంట్ ఏంటి..?

ఇంకా చదవండి ...
    BJP Gave Route Map to Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పొత్తుల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీ అధినేత వ్యాఖ్యలు ఈ పొత్తులపై గందరగోళం మరింత పెంచుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  కోరినట్టు బీజేపీ (BJP) పెద్దలకు.. ఏపీపై రూట్ మ్యాప్ ఇస్తే.. పొత్తులపై క్లారిటీ వస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దలు రూట్ మ్యాప్ ఇచ్చారని.. ఆ రూట్ మ్యాప్ లో ప్రత్యేకించి వైసీపీ (YCP)తో సంబంధాలు.. టీడీపీ (TDP) విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై క్లారిటి ఇచ్చినట్టు టాక్. అలాగే ఏపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించడంపై బీజేపీ పెద్దలు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.. దీంతో బీజేపీ పెద్దలు ఇచ్చిన రూట్ మ్యాప్ ఏంటి అన్నది సర్వత్రా ఆసక్తి పెంచుతోంది.

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024 లో జ‌రిగే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకోవ‌ద్ద‌ని, 2029 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా జ‌న‌సేన‌-బీజేపీ క‌లిసి వెళ‌దామ‌ని రూట్ మ్యాప్ లో చెప్పిన‌ట్లు స‌మాచారం. బీజేపీ ఎప్పుడూ ఎన్నిక‌ల‌కు ముందుగా ఏ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేద‌ని, ఆ సాంప్ర‌దాయం కూడా లేద‌ని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 2024 లోక్ స‌భ ఎన్నిక‌లు ఎలా ఉంటాయో తెలియ‌దు కాబ‌ట్టి.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ మ‌న‌కు న‌మ్మ‌క‌స్తుడైన మిత్రుడిగా ఉన్నాడ‌ని, కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ప‌క్క రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారుక‌దా.. అని అన్న‌ట్లు తెలుస్తోంది. 

    వచ్చే ఎన్నికల ఫలితాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పార్టీ నడిపేందుకు కావాలంటే ఆర్థికంగా కూడా అండ‌దండ‌లు అందిస్తామ‌ని.. ఇంకా అవ‌స‌ర‌మ‌నుకుంటే కేంద్రంలో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో భేటీ అయిన త‌ర్వాత ఆయ‌న‌కు మ‌రికొన్ని హామీలిచ్చే అవ‌కాశం ఉన్నట్టు సమాచారం.

    ఇదీ చదవండి : ఇదేం పులిరా బాబు.. అధికారులకే షాక్ ఇస్తోంది.. బోనులోకి చిక్కేది లేదా..?

    జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం. బీజేపీ-జ‌న‌సేన క‌లిసి వెళ‌దామ‌నుకుంటున్నాయ‌ని ఆ రూట్ మ్యాప్ లో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ అందుకు సిద్ధంగా ఉన్నారా? లేరా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ పవన్ ఎక్కడా బీజేపీకి దగ్గరా ఉన్నట్టు కనిపించడం లేదు. బీజేపీ నిర్వ‌హించిన గోదావ‌రి గ‌ర్జ‌న‌కు కూడా ప‌వ‌న్‌కు ఆహ్వానం అంద‌లేదు. మరి తాజా రూట్ మ్యాప్ పై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు