హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

JP Nadda In Rajamundry: అప్పుల్లో ఆంధ్రప్రదేశ్.. కొన్నివర్గాలకే సంక్షేమ పథకాలు.. బీజేపీకి అధికారం ఖాయమన్న జేపీ నడ్డా

JP Nadda In Rajamundry: అప్పుల్లో ఆంధ్రప్రదేశ్.. కొన్నివర్గాలకే సంక్షేమ పథకాలు.. బీజేపీకి అధికారం ఖాయమన్న జేపీ నడ్డా

బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP

బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP

JP Nadda: ప్రతిపక్షాలు ఎదగకుండా చూడాలన్నదే జగన్ లక్ష్యమని జేపీ నడ్డా విమర్శించారు. ఏపీలో బీజేపీని ఎవరూ అడ్డుకోలేరని.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

  వైసీపీ ప్రభుత్వంపై జేపీ నడ్డా (JP Nadda)ధ్వజమెత్తారు. కేంద్రం నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఏపీకి రూ. 8 లక్షల కోట్ల అప్పు ఉందని.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదని విమర్శించారు. రాజమండ్రి (Rajamundry)ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ గోదావరి గర్జన సభలో పాల్గొన్న నడ్డా.. ఏపీలోని వైసీపీ(YSRCP) ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని బీజేపీకి(BJP) అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో కొన్నివర్గాలకే మేలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకపోయిందని.. రాష్ట్రంలో ల్యాండ్, లిక్కర్, శాండ్ మాఫియా రాజ్యమేలుతోందని మండిపడ్డారు.

  ప్రతిపక్షాలు ఎదగకుండా చూడాలన్నదే జగన్ లక్ష్యమని విమర్శించారు. ఏపీలో బీజేపీని ఎవరూ అడ్డుకోలేరని.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 2014కు ముందు కేంద్రంలో అవినీతి ప్రభుత్వం ఉందని.. గతంలో పేపర్‌లో స్కామ్‌ల వార్తలు వచ్చేవని అన్నారు. కానీ మోదీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని జేపీ నడ్డా అన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తెచ్చారని.. సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో ముందుకువెళుతున్నామని తెలిపారు.

  రాజమండ్రి సాంస్కృతిక నగరమని... ఈ గడ్డ నుంచే తెలుగు భాష ప్రారంభమైందని జేపీ నడ్డా అన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. 2014కు ముందు చాలా ప్రాంతాల్లో కరెంట్, విద్య, వైద్యం ఉండేది కాదని.. అవినీతి అంటే జీవితంలో భాగం కాదని ప్రధాని అన్నారని జేడీ నడ్డా పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో అవినీతికి చరమగీతం పాడామని చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అన్న‌దే లేకుండాపోయింద‌ని విమర్శించారు.

  Chandrababu| Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్లాన్ రివర్స్.. చంద్రబాబుకు అనుకోని అవకాశం ఇచ్చిన బీజేపీ

  Minister Roja: ఆమె చేతిలో రోజాకు ఓటమి తప్పదా ? అంత సీనుందా ?

  కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న నిధుల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల కోసం విడుద‌ల అవుతున్న నిధుల‌ను రాష్ట్రం దారి మ‌ళ్లిస్తోంద‌ని న‌డ్డా ఆరోపించారు. జ‌గ‌న్ పాల‌న‌లో అభివృద్ధి కుంటుప‌డిందని, జ‌గ‌న్ పాల‌న‌లో శాంతి భ‌ద్ర‌త‌లు క‌రవ‌య్యాయని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌శ్నించే వారిపై కేసులు పెడుతున్నారని, పెట్టుబ‌డులు రాక రాష్ట్రంలో నిరుద్యోగం తాండ‌విస్తోందని నడ్డా విమర్శించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Bjp, JP Nadda, Ysrcp

  ఉత్తమ కథలు