Home /News /andhra-pradesh /

AP POLITICS BJP MP SUJANA CHOWDARY COMMENTS ON AP THREE CAPITALS FORMULA AK

మూడు రాజధానులు ఓ జోక్... బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ ప్రభుత్వం రాజధాని తరలింపు విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు.

    మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ హాస్యాస్పదమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం రాజధాని తరలింపు విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. తమ ఇష్టానుసారంగా మార్చుకోవడానికి రాజధాని అన్నది వారి రిజిష్టర్ కంపెనీ కాదని సుజనా చౌదరి విమర్శించారు. హైకోర్టు తరలింపు అన్నది కూడా అంత తేలిక కాదని... దానికి చాలా ప్రాసెస్ ఉంటుందని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడంపై బీజేపీ వైఖరి ఏంటనే దానిపై మాత్రం సుజనా చౌదరి స్పష్టం ఇవ్వలేదు. ప్రజలకు ఏది మేలు అని భావిస్తే... అదే తమ విధానమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తాము పోరాటం చేస్తామని... అందుకు ఇది ఆరంభం మాత్రమే అని ఆయన అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amaravati, Bjp, Chandrababu naidu, Sujana Chowdary

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు