Home /News /andhra-pradesh /

AP POLITICS BJP MP GVL NARSIMHA RAO SLAMS TO AP GOVERNMENT AND CM JAGAN ON FUNDS MISSING NGS

AP BJP: ఏపీ సీఎం జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలి..? బీజేపీ ఎంపీ జీవీఎల్ సవాల్..

కేటీఆర్ దమ్ముంటే యూపీ రావాలి

కేటీఆర్ దమ్ముంటే యూపీ రావాలి

GVL on CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తన స్ట్రాటజీ మార్చిందా..? మొన్నటి వరకు వైసీపీతో స్నేహపూర్వకంగానే ఉన్న.. బీజేపీ ఇప్పుడు ఎన్నికలకు మాత్రం ఢీ కొట్టేందుకే సిద్ధమవుతోందా..? తాజాగా జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు అర్థం అదేనా..?

    GVL on CM Jagan:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బీజేపీ స్టాండ్ మార్చిందా..? ఇప్పటి వరకు అధికార వైసీపీ (YCP)తో సన్నిహితంగా ఉన్న.. కాషాయ పార్టీ ఇప్పుడు ఢీ అంటే ఢీ అని ఢీ కొట్టాలని భావిస్తోందా..  ఈ నెలల ఏపీకి వస్తున్న ప్రధాని పర్యటనతో ఆ విషయంపై క్లారిటీ రానుందా..? గత కొంత కొలంగా ఏపీ బీజేపీ (BJP) నేతలు సైతం అదే మాట చెబుతూ వస్తున్నారు. అధికార వైసీపీకి, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సమాన దూరం పాటిస్తామంటున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పవన్ (Pawan) కు.. బాగానే జనాధరణ ఉందని నిర్దారణకు వచ్చినట్టు సమాచారం.. అందుకే ఒక వేళ ఈ ఎన్నికలకు కాకపోయినా.. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటామనే అభిప్రాయంలో కనిపిస్తున్నారు కమలనాథులు.. అందుకే ఇకపై ఏపీలో తమ స్ట్రాటజీ మారుస్తోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా జీవిఎల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

    ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narsimha Rao)  సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తాయని, మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారని.. ఒకవేళ అది నిజం అవుతుందనే నమ్మకంతో ఉంటే.. వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలని జగన్‌ను సవాల్ చేస్తున్నట్లు జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. 

    సీఎం జగన్ ను నిజంగా అంత నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. ఒకవేల నమ్మకం ఉంట..? వైసీపీ ప్లీనరీలో జగన్ ఈ విషయం గురించి ప్రకటన చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. వైసీపీ అంటే గోల్‌మాల్ పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారని.. రాష్ట్రంలో ప్రజాకంటక పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. ఏపీలో ఉన్నది సంక్షేమ పానల కాదు దుర్మార్గమైన పాలన అంటూ జీవీఎల్ మండిపడ్డారు.

    ఇదీ చదవండి : టీటీడీ ఉచిత వివాహాలకు సర్వం సిద్ధం.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. ఎలా అప్లై చేసుకోవాలి.. అర్హతలేంటి?

    ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపైనా జీవీఎల్ స్పందించారు. రెండు నెలల్లో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచడం దారుణం కాదా అని నిలదీశారు. కేంద్రం డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం బస్ ఛార్జీలు పెంచడమేంటని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి 800 కోట్ల రూపాయలు లాగేయటం దారుణమని మండిపడ్డారు. ఇదేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తే సాంకేతిక లోపం అంటున్నారని.. అప్పు పుట్టని రోజు ఏదో ఒక అకౌంట్లోకి దూరి లాగేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఎమ్మెల్యేల అకౌంట్లలో సొమ్ములకు సాంకేతిక లోపం ఎందుకు జరగడం లేదని నిలదీశారు. వెంటనే లాగేసిన సొమ్ము అకౌంట్లలో తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందుంది అని అంటున్నారని.. అదే కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవన్నారు. ఈ ర్యాంకింగ్స్ విధానాన్ని పునః సమీక్షించాలని జీవీఎల్ కోరారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, Ap cm jagan, AP News, GVL Narasimha Rao

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు