GVL Direct Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జీవీఎల్ నరసింహారావు (GVL Narisimharao) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2024 నాటికి ఆయన పదవీ కాలం ముగియనుండగ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్టు టాక్.. బీజేపీకి గౌరవ ప్రదమైన ఓట్ బ్యాంక్.. గతంలో గెలిచిన చరిత్ర ఉన్న విశాఖపట్టణం మీద కర్చీఫ్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. వలస నేతలను ఆదరించే అర్బన్ ఓటర్లను ఆకర్షించడం ద్వారా ప్రజాక్షేత్రంలో గెలవాలనేది జీవీఎల్ ఆలోచన అంటున్నారు. అందుకే కొద్దికాలంగా ఢిల్లీ టు వైజాగ్ (Deldhi to Vizag) షెటిల్ సర్వీస్ చేస్తున్న ఆయన.. ఇటీవల క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం మాత్రమే కాదు.. ఇల్లు కొనుక్కొని మరీ తానూ లోకలకే అంటున్నారు. దీని వెనుక అసలైన కారణం విశాఖ నుంచి పోటీ చేయడమే అంటున్నారు.
జీవీఎల్ పోటీపై బీజేపీ హైకమాండ్ ఆలోచన అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా..? ఆయన మాత్రం చాలా ముందుగానే గ్రౌండ్‌లో దిగే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ అభివృద్ధి నినాదం భుజానికెత్తుకొని అటు ఢిల్లీలోనూ.. ఇటు గల్లీలోనూ హడావుడి చేస్తున్నారు. కాస్మోపాలిటీన్ నగరం కావడంతో అర్బన్ ఓటర్ల తీర్పు కీలకమనే లెక్కలు బాగా వంటబట్టించుకున్నట్టే కనిపిస్తోంది ఈ సెఫాలిజిస్టు.
మత్య్సకార, యాదవ, కాపు సామాజికవర్గాలకు చేరువయ్యే విధంగా ఆయన కదలికలు ఉంటున్నాయని తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్, ఐటీ రంగ అభివృద్ధి వంటి కీలకమైన అంశాలపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలో తరచుగా రాజ్యసభలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీ కంటే ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా విశాఖ, ఉత్తరాంధ్ర వ్యవహారాలను లేవనెత్తుతున్నారు.
ఇదీ చదవండి : చంద్రబాబు కాదు శవాల నాయుడు.. పవన్ పైనా మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
ఆయన అయితే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నా..? రాజకీయంగా ఆశించినంత మైలేజ్ రావడం లేదని సన్నిహితులకు చెబుతున్నట్టు తెలుస్తోంది. సాంప్రదాయ రాజకీయాలను తనవైపు తిప్పు కోవాలంటే కాంట్రవర్సీ కామన్ పాయింట్‌గా మలుచుకోవడమే కరెక్ట్ అని జీవీఎల్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితిలో సంస్థాగతంగా బలంలేని బీజేపీ నుంచి పోటీ చేసి టీడీపీ , వైసీపీలను ఎదుర్కోవడం సాధ్యం కాదనేది ఆయన ఆలోచన.
ఇదీ చదవండి : గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఏ-1 అరెస్ట్.. మరి నెక్ట్స్ ఎవరు?
మరోవైపు ఏపీ బీజేపీలో వర్గాలు కూడా జీవీఎల్ కు మైనస్ గా మారాయి. ప్రస్తుతం ఏపీ బీజేపీలో Aటీమ్, Bటీమ్ ఉన్నాయి. అందులో ఒకవర్గం టీడీపీకి అనుకూలంగా పని చేస్తుందని, రాష్ట్ర ప్రతిష్టతను ప్రయోజనాలను దెబ్బ తీయడమే లక్ష్యంగా పెట్టుకుందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బహిరంగ వేదికలపైన టీబీజేపీ అంటూ సెటైర్లు వేస్తోంది. మరోవర్గ వైసీపీ మద్దతుగా ఉంటోంది. అందులోనే జీవీఎల్ ఉన్నారని చర్చ ఉంది. అయితే ఆయన ఆ ముద్ర చెరుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మళ్లీ స్టయిల్ మార్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తన బాధ్యత అంటూనే కాంట్రవర్సీని ఆయుధంగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో నిరంతరం వార్తల్లో నిలవాలనేది అసలు ఎత్తుగడ అంటున్నారు.
ఇదీ చదవండి : లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకే కుట్రలు.. ప్రమాదాన్ని పార్టీకి అంటగట్టడంపై టీడీపీ ఫైర్
ఇటీవల విశాఖ వేదికగా కాపునాడు బహిరంగ సభ జరిగింది. రాజకీయ కారణాలతో ప్రధాన పార్టీలు దూరం పాటించాయి. కాపు కాకపోయినా కాపునాడు సభకు వెళ్లిన జీవీఎల్ పెద్దకాపు అవతారం ఎత్తారు. కాపులకు మద్దతు పలికారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టమంటే కాపు నేతలే ముందుకు రావడం లేదని వేడి రాజేసే ప్రసంగం చేశారు. రంగా విగ్రహాన్ని బీచ్ రోడ్డులో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ప్రభుత్వానికి లేఖ రాసేందుకు సిద్ధం అయ్యారు. విశాఖ నుంచి లోక్ సభ కు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న జీవిఎల్ మాత్రం ఈ సభను వాడుకొని కాపుల్లో క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారనే ప్రచారం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP News, GVL Narasimha Rao, Visakhapatnam, Vizag