హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Janasena-Bjp: జనసేన, పవన్ కళ్యాణ్‌పై బీజేపీ నేత సంచలన ఆరోపణలు..

Janasena-Bjp: జనసేన, పవన్ కళ్యాణ్‌పై బీజేపీ నేత సంచలన ఆరోపణలు..

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Ap Politics: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని పవన్ కళ్యాణ్‌ను కోరామని.. కానీ ఆయన స్పందించలేదని ఆరోపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జనసేనపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్(Madhav) సంచలన ఆరోపణలు చేశారు. జనసేనతో(Janasena) కలిసి బీజేపీ(BJP) ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని ప్రజలు నమ్ముతారని వ్యాఖ్యానించారు. తమతో పవన్ కళ్యాణ్ కలిస రావడం లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని పవన్ కళ్యాణ్‌ను కోరామని.. కానీ ఆయన స్పందించలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించమని చెప్పారు కానీ.. బీజేపీని గెలిపించాలని కోరలేదని ఆయన అన్నారు. జనసేనతో పొత్తు ఉన్నా.. లేనట్టే ఉన్నామని కామెంట్ చేశారు. జనసేనపై తమకు నమ్మకం ఉందని, తమపై జనసేనకు నమ్మకం ఉందన్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. రెండు పార్టీలు కలిసి పోరాటాలు చేయడం ద్వారా ప్రజల్లో తమపై నమ్మకం కలిగేలా చేయొచ్చని ఆయన అన్నారు. ఇలాంటి ప్రయత్నాలు జరగకపోవడం వల్లే రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా.. క్షేత్రస్థాయిలో తమపై ప్రజలకు నమ్మకం కలగడం లేదని వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో ఇరు పార్టీలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ప్రజల్లో ఉమ్మడిగా పోరాటం చేయాలని అన్నారు. అయితే మాధవ్ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించారు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉన్నారని అన్నారు. మాధవ్ ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

అయితే బీజేపీ ముఖ్యనేత మాటలతో రాజకీయంగా కొత్త చర్చకు తెరలేచినట్టయ్యింది. రాజకీయంగా బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నా.. రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో మాత్రం కలిసి నడవడం లేదు. ఇదే విషయాన్ని మాధవ్ బహిరంగంగా వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలను ఇటు బీజేపీ నాయకత్వం, అటు జనసేన సీరియస్‌గా తీసుకుంటుందా ? అన్నది చూడాల్సి ఉంది.

Nara Lokesh: టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన నారా లోకేశ్, బ్రాహ్మణి..!

Good News: ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. నేటి నుంచి పిల్లలకు పౌష్టికాహారం.. ప్రారంభించిన సీఎం జగన్

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన చిరంజీవిరావు విజయం సాధించారు. విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతం తొలి ప్రాధాన్యత ఓట్లలో సాధించగా మిగిలినవి రెండో ప్రాధాన్యత ఓట్లు రావడంతో ఆయన విజయం సాధించారు. విజయానికి 94,509 ఓట్లు అవసరం కాగా, తొలి ప్రాధాన్యంలో 82,958, రెండో ప్రాధాన్యంలో 11,551 ఓట్లు సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి చిరంజీవిరావుకు మొత్తం 1,12,686 వచ్చాయి. వైసీపీ అభ్యర్థి సుధాకర్ టీడీపీ అభ్యర్థికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఇద్దరి మధ్య భారీ తేడా కనిపించింది. సిటింగ్‌ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్థి మాధవ్‌ సహా 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి.

First published:

Tags: Andhra Pradesh, Bjp, Janasena

ఉత్తమ కథలు