హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

చంద్రబాబు ఓ కట్టప్ప.. బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబు ఓ కట్టప్ప.. బీజేపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)

చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)

ఏపీలో మళ్లీ టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదని బీజేపీ నేత సునీల్ ధియోధర్ అన్నారు.. టీడీపీకి తాము డోర్లు మూసేశామని స్పష్టం చేశారు.

  టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ ధియోధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కట్టప్ప లాంటివారని... ఆయన వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఏపీలో మళ్లీ టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదని ఆయన స్పష్టం చేశారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన సునీల్ ధియోధర్...టీడీపీకి తాము డోర్లు మూసేశామని సునీల్ ధియోధర్ అన్నారు. ఇది తన మాట కాదని... మోదీ, అమిత్ షా, నడ్డా చెప్పిన మాట అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ శకం ముగిసిపోతుందని... ఆ పార్టీ నేతలంతా బీజేపీలో చేరాలని ఆయన సూచించారు. జనసేన, వైసీపీలతో బీజేపీకి ఎలాంటి ఒప్పందం లేదని సునీల్ ధియోధర్ అన్నారు. బీజేపీ స్వతహాగా ఎదుగుతుందని వ్యాఖ్యానించారు.

  కొద్దిరోజుల క్రితం బీజేపీతో విడిపోయి తప్పు చేశామని... మోదీతో తనకు వ్యక్తిగతంగా ఎలా విభేదాల లేవని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతోందని... ఈ క్రమంలోనే టీడీపీ అధినేత ఈ కామెంట్స్ చేశారని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన ఏపీ బీజేపీ... టీడీపీతో మళ్లీ పొత్తు పెట్టుకునే ఆలోచన తమకు ఏ మాత్రం లేదని వివరణ ఇస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap bjp, AP News, AP Politics, Bjp, Bjp-tdp, Chandrababu naidu, Sunil deodhar, Tdp

  ఉత్తమ కథలు