హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: పవన్ తో పొత్తు విషయంలో కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు.. తప్పంతా సోమువీర్రాజుదే అంటూ ఫైర్

Breaking News: పవన్ తో పొత్తు విషయంలో కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు.. తప్పంతా సోమువీర్రాజుదే అంటూ ఫైర్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

Breaking News: బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా సొంత పార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీరుపై ఫైర్ అయ్యారు. పవన్ ఇష్యూలో తప్పంతా సోము వీర్రాజుదే అని ఆరోపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. విశాఖ (Visakha) ఘటనతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. ఇప్పటికే అధికార వైసీపీ వర్సెస్ పవన్ (YCP vs Pawan) యుధ్దం తారా స్థాయికి చేరింది. దీంతో అధికార పార్టీపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు.. అక్కడితో ఆగకుండా చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారు. అక్కడితోనే ఆగలేదు. బీజేపీ (BJP) అధిష్టానంపైనా ఆసహనం వ్యక్తం చేశారు. రూట్ మ్యాప్ ఇవ్వకుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వెంటనే.. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుుడు (Chandrababu Naidu) ని కలిశారు.. వీరిద్దరి కలియకతో పవన్ బీజేపీ కి బై బై చెప్పేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు సైతం దీనిపై భిన్నంగా స్పందించారు.. అయితే తాజాగా ఈ ఘటనపై బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ (Kanna Lakshimi Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ తో సఖ్యత కొనసాగించే విషయంలో సోము వీర్రాజు ఘోరంగా ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే ఉందన్నారు. సోము వీర్రాజు ఒక్కడే అన్ని విషయాలు చూసుకోవడం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి అన్నారు.

అసలు పార్టీలో ఏం జరుగుతోందో కూడా తెలియడం లేదన్నారు. ఇప్పటికైనా హై కమాండ్ కలుగచేసుకోకపోతే పరిస్థితి ఇబ్బందిగా మారుతుంది అన్నారు. అలాగే ఏపీలో ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో అన్ని పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలి అన్నారు. టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ వెళ్లడమే మంచిదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.

ఇదీ చదవండి : చంద్రబాబు-పవన్ సమావేశంపై బీజేపీ అలర్ట్.. సోమువీర్రాజు సంచలన నిర్ణయం

ప్రస్తుతం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతల సంఖ్య పెరుగుతోంది. సోమువీర్రాజు వర్గం మాత్రం అందుకు భిన్నంగా ఉంది.. టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్నారు. మరి బీజేపీలో మెజార్టీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తే మంచిది అంటున్నారు. ఇప్పుడు వారి జాబితో కన్నా లక్ష్మీ నారాయణ ఒకరు.

ఇదీ చదవండి: వరద ప్రాంతాల బాధితులకు అండగా బాలయ్య.. ఆయన్ను చూసేందుకు నదిలో దూకేసిన అభిమాని.. ఈత రాక ఏం జరిగింది అంటే?

అయితే మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో ఎక్కువమంది ప్రజలు టీడీపీ, జనసేన , బీజేపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని కోరుతున్నారని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి.. పొత్తులపై అప్పుడే క్లారిటీ వస్తుంది అన్నారు. మరి దీనిపై సోము వీర్రాజు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ రోజు సోము వీర్రాజు ప్రత్యేకంగా పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఆ భేటీ ఇప్పుడు హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Janasena, Kanna Lakshmi Narayana, Pawan kalyan

ఉత్తమ కథలు