హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. త్వరలో కొత్త అధ్యక్షుడు..? ఆయనొస్తే వైసీపీకి కష్టమేనా..?

ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. త్వరలో కొత్త అధ్యక్షుడు..? ఆయనొస్తే వైసీపీకి కష్టమేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బలపడేందుకు బీజేపీ (BJP) చాలా గట్టిగానే ట్రై చేస్తోంది. ఇందుకోసం ఎత్తులు, వ్యూహాలు రచిస్తూనే ఉంది. కానీ ఏదీ వర్కవుట్ అవడం లేదు. వైసీపీని ఎంత విమర్శిస్తున్నా ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ వైపు మళ్లడం లేదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బలపడేందుకు బీజేపీ (BJP) చాలా గట్టిగానే ట్రై చేస్తోంది. ఇందుకోసం ఎత్తులు, వ్యూహాలు రచిస్తూనే ఉంది. కానీ ఏదీ వర్కవుట్ అవడం లేదు. ప్రజల్లో.. ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ ‌తో దోస్తీ కట్టినా బీజేపీకి మాత్రం మైలేజ్ రాలేదన్నది వాస్తవం. అందుకు ప్రధాన కారణం తెరవెనుక వైసీపీతో సఖ్యతగా మెలగడం. అవసరమైనప్పుడల్లా కేంద్రానికి వైసీపీ మద్దతిస్తున్నా.. పార్టీ పరంగా మాత్రం ఏపీలో బీజేపీ బలపడటం లేదు. పైగా కేంద్రం ఇచ్చే నిధులు, పథకాలపై జగన్ స్టిక్కర్ వేసుకుంటున్నారనే అభిప్రాయం కమలనాథుల్లో గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో జగన్ కు కళ్లెం వేసేందుకు బీజేపీ ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందట.

  ప్రస్తుతం ఏపీలోని బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వానికి ధీటుగా కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు. సభలు, సమావేశాలు పెట్టినప్పుడు కామెంట్స్ చేయడం తప్ప.. ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఏ కార్యక్రమాన్ని ఊహించుకున్నంత స్థాయిలో సక్సెస్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నా అవి ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు. ఇక ఆయన కామెంట్స్ ను వైసీపీ నేతలు పట్టించుకోవడం దాదాపు మానేశారు.

  ఇది చదవండి: దుర్గమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టిన రోజా.. మంత్రిగారి మొక్కు అందుకే..!

  ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే యోచనలో బీజేపీ పెద్దలున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడని పేరున్న ఓ వ్యక్తిని రంగంలోకి దించేందుకు మోదీ, షా సిద్ధమయ్యారట. జగన్ కు నిత్యం పక్కలో బల్లెంలా మారే వ్యక్తిగా ఆ పార్టీ కార్యదర్శి సత్యకుమార్ ను అనుకుంటున్నారట. ఏపీలో సొంతగా ఎదగాలంటే సత్యకుమారే కరెక్ట్ అని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

  ఇది చదవండి: ఏపీకి తుఫాన్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలర్ట్..

  సత్యకుమార్ ను రంగంలోకి దించితే వైసీపీని ధీటుగా ఎదుర్కొవచ్చనేది అధిష్టానం ప్లాన్ గా కనిపిస్తోంది. ఎందుకంటే సత్యకుమార్ కు వాగ్ధాటి ఎక్కువ, అలాగే ఎన్నికల వ్యూహాల్లోనూ దిట్ట.. అందుకే కీలక రాష్ట్రాల భాధ్యతలు బీజేపీ పెద్దలు సత్యకుమార్‌కే అప్పజెప్తుంటారు. ప్రస్తుతం యూపీ బీజేపీకి కో ఇన్ ఛార్జ్ గా సత్యకుమార్ ఉన్నారు. ఎన్నికల సమయంలోనూ చురుగ్గాపనిచేసి పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించారు.

  ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్.. సీఎం జగన్ వ్యూహం వర్కవుట్ అవుతుందా..?

  ఇక ఏపీకి వచ్చినప్పుడల్లా వైసీపీ నేతలకు చురుక్కుమనేలా విమర్శలు ఆరోపణలు చేయడం సత్యకుమార్ నైజం ఆయన విమర్శలకు మంత్రులు కౌంటర్లిచ్చినా ఎక్కడా తగ్గరు.వైసీపీ అంటేనే ఒంటికాలిపై లేచే సత్యకుమార్.. ఇప్పటివరకు టీడీపీని విమర్శలేదు. 23 సీట్లు వచ్చిన పార్టీ గురించి మాట్లాడటం ఎందుకనుకున్నారో లేక ఎప్పటికైనా మిత్రులు కావాల్సిన వారే కదా అని ఊరుకున్నారో తెలియదుగానీ.. సత్యకుమార్ ఏపీ బీజేపీ చీఫ్ అయితే టీడీపీకి దగ్గర కావొచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. బీజేవీ, జనసేన , టీడీపీ కలిస్తే అధికారంలోకి వచ్చే  అవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో సత్యకుమార్ వస్తే... ఈ పొత్తు కూడా ఖాయమవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP Politics

  ఉత్తమ కథలు