AP POLITICS BJP FOLLOWING NEW STRATEGIES TO STRENGTHEN IN ANDHRA PRADESH DESPITE ATMAKUR LOST FULL DETAILS HERE PRN
BJP: ఏపీలో బలపడేందుకు బీజేపీ యత్నం.. మోదీ టూర్ తో వ్యూహం మారుతుందా..?
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బీజేపీ (BJP) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఏపీలో బలపడాలని కార్యాచరణ సిద్ధం చేస్తున్న వేళ నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు కేంద్ర బీజేపీ ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం అందుకు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బీజేపీ (BJP) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఏపీలో బలపడాలని కార్యాచరణ సిద్ధం చేస్తున్న వేళ నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు కేంద్ర బీజేపీ ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం అందుకు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇటీవల కేంద్ర మంత్రుల పర్యటన లతోపాటు రాబోయే రోజుల్లో మరికొంతమంది కేంద్ర మంత్రుల పర్యటన లను రాష్ట్రంలో ఉండేలాగా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. అసలు ఏపీలో బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి..? ప్రజల్లో బలపడాలని పార్టీని రాష్ట్రంలో పాగా వేసేందుకు కమలదళం సిద్ధం చేస్తున్న కార్యచరణ ఎంటి..? ఏపీలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వేళ కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. త్వరలో ప్రధాని మోదీ కూడా ఏపీకి రానుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు కేంద్ర సహాయ మంత్రులు పర్యటన కొనసాగిస్తుండగ రాబోయే రోజుల్లో మరికొంత మంది మంత్రులు రాష్ట్రంలో పర్యటనలు చేసే లాగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆశించిన స్థాయిలో బీజేపీకి మైలేజ్ రాక పోవడం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పరాభవం ఎదురవడంతో ఇకపై అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని బిజెపి తెరవెనుక వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కేంద్ర నాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేయగా అందుకు తగ్గట్టుగానే వరుసగా కేంద్రమంత్రులు పర్యటనను కొనసాగిస్తున్నారు.
కేంద్ర మంత్రులు వరుస పర్యటనలలో ఎన్నికల ముందు ఏ హామీలను ఇచ్చాము. కేంద్ర మంత్రుల పర్యటనల్లో భాగంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత చేశాము.. ఎంత మేరకు హామీలను అమలు చేశాము.. ఎంత మేరకు నిధులు ఇచ్చాము.., ఏ నిధులు ఎంత మొత్తంలో ఇచ్చాము. కేంద్రం ఇచ్చిన వాట ఎంత ఎంతమంది. లబ్ధిదారులకు చేరాయి... లబ్ధిదారులకు ఇచ్చిన వాటిలో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు నిధులు ఇస్తుందనే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర మంత్రులు.
మరోవైపు కేంద్ర మంత్రులు వరుస పర్యటన చేస్తూనే రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి ఏరకమైన స్టేక్ ఉందనే అంశాన్ని సైతం నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రులు రాష్ట్ర లో పర్యటించిన సందర్భంలో ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న అంశాలన్నింటిని కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అనేక అంశాల విషయంలో ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వ పని తీరుపైన ఆరాతీస్తున్నారు.
ఇటీవల కాలంలో పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేపట్టేందుకు ప్రతి జిల్లాలోనూ పదాధికారులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు బీజేపీ పెద్దలు. రాష్ట్రంలో పార్టీ పార్టీలైన్ ఏవిధంగా ఉండబోతోంది వైసీపీ, టీడీపీలతో పొలిటికల్ వ్యూ ఎలా ఉంటుంది..? రాబోయే రోజుల్లో బీజేపీ ఎలా ముందుకు వెళ్లబోతోంది అనే అంశాలను పధాధికారులకు స్పష్టం చేస్తున్నారు. జేపీ నడ్డా పర్యటన ముగిసిన తరువాత సైతం కేంద్రమంత్రులు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా బల పడేందుకు బిజెపి ముందుకు వెళ్లబోతోందని కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకే కేంద్ర అధినాయకత్వం ఆదేశాలతో రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. అందులో భాగంగానే ప్రస్తుతం కేంద్ర మంత్రులు ఆ పార్టీ సీనియర్ నేతలు పర్యటనలను ఏపీలో చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ఐతే ప్రధాని మోదీ ఏపీ పర్యటన తర్వాత పార్టీ కేడర్ లో మరింత జోష్ వస్తుందని కమలనాథులంటున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.