హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: వైఎస్ భారతిని సీఎం చేయండి.. కరోనా కట్టడి అవ్వాలంటే అదే మార్గం.. విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh: వైఎస్ భారతిని సీఎం చేయండి.. కరోనా కట్టడి అవ్వాలంటే అదే మార్గం.. విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు

వైఎస్ భారతిని సీఎం చేయాలి

వైఎస్ భారతిని సీఎం చేయాలి

ఏపీలో కరోనా తీవ్రంగా విరుచుకుపడుతోంది. కేసులతో పాటు మరణాలు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఏపీలో పరిస్థితి అదుపులోకి రావాలి అంటే వైఎస్ భారతిని సీఎంగా చేయాలి.. అలా అయితేనే ఏపీలో పరిస్థితులు అదుపులోకి వస్తాయా? ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా?

ఇంకా చదవండి ...

  ఏపీని కరోనా వైరస్ వెంటాడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కఠినంగా కర్ఫ్యూ అమలు చేస్తన్నా.. కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. కరోనా కేసులకు తోడు మరణాలు కూడా భారీగా నమోదు అవుతున్నాయి. ఏపీని కరోనా వైరస్ భయపెడుతోంది. కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య కట్టడి కావడం లేదు. కరోనా బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 24 వేలకుపైగా కరోనా కేసులు నమోదైతే.. కరోనా కారణంగా వందకు పైగా మరణాలు సంభవించండం ఆందోళన పెంచుతోంది.

  తాజాగా నమోదైన కేసులు చూస్తే లాక్ డౌన్ తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. దీనిపై సీఎం జగన్ రేపు నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 94 వేల 550 నమూనాలను పరీక్షిస్తే.. అందులో 24 వేల 171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లాల వారిగా కేసుల సంఖ్య చూస్తే.. అనంత పురం జిల్లాలో అత్యధికంగా 3356 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 2885, తూర్పు గోదావరి జిల్లాలో 2876, విశాఖలో 2041, పశ్చిమగోదావరి జిల్లాలో 2426 కేసులు నమోదయ్యాయి. ఇక మిగిలిన జిల్లాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. గుంటూరులో 1787, కడపలో 1638, కృష్ణలో 705, కర్నూలులో 730, నెల్లూరులో 1593, ప్రకాశంలో1628, శ్రీకాకుళంలో 1509, విజయనగరం జిల్లాలో997 కరోనా కేసులు నమోదయ్యాయి.

  కేసుల సంఖ్య రెట్టింపు సంగతి పక్కన పెడితే.. కరోనా మరణాలకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని విపక్షాలు రోజూ విమర్శిస్తున్నాయి. వాస్తవాలు మాట్లాడాలి అంటే ఇంకా ఎక్కువగానే మరణాలు నమోదవుతున్నాయని.. ప్రభుత్వం మాత్రం తక్కువ చేసి లెక్కలు చెబుతోందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఆక్సిజన్ అందకపోవడంతోనూ.. సమయానికి కరోనా బాధితులకు వైద్యం అందకపోవడంతోనే చనిపోతున్నారని విపక్షలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో ఆక్సిజన్ అందక మరణించనవారివి అన్నీ ప్రభుత్వ హత్యలే అని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే తిరుపతి ఘటనలో ఆక్సిజన్ అందక 11 మంది మరణించారని ప్రభుత్వమే ఒప్పుకుంది.

  ఇదే సమయంలో బీజేపీ నేత విస్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో అన్నీ అస్తవ్యవస్తంగా ఉన్నాయని విష్ణు కుమార్‌రాజు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో ప్రజలు అవస్తలు పడుతున్నారని ఆక్షేపించారు. అందుకే ప్రధాన కారణం సీఎం జగన్‌ చేతకానితనమే అన్నారు. ఆక్సిజన్‌ అందక ప్రజలు చనిపోతుండడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది అన్నారు. వెంటనే సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేసి ఆయన సతీమణి వైఎస్‌ భారతికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే.. అప్పుడైనా రాష్ట్రంలో కొంత మార్పు వస్తుందేమో చూద్దామని వ్యాఖ్యానించారు. కనీసం ఇప్పటికైనా ప్రజల ఆర్తనాదాలను జగన్‌ అర్థం చేసుకోవాలని విష్ణు కుమార్ రాజ్ డిమాండ్ చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Ys bharathi

  ఉత్తమ కథలు