AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల హస్తినలో ప్రధాని మోదీ (Prime Minster Modi)తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. కలవడం.. అక్కడ ఇద్దరికీ మోదీ ప్రాధాన్యత ఇవ్వడంపై రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదట ఆజాద్ కా అమృత్ మహోత్సవం (Azadi Ka Amrit Mahotsav) కార్యక్రమానాకి చంద్రబాబు హాజరు అయితే.. ఆ సందర్భంగా ప్రత్యేకించి చంద్రబాబును పక్కకు పిలిచి మరీ మోదీ మట్లాడారు.. ఇద్దరి మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాకపోయినా..? ఢిల్లీ ఎందుకు రావడం లేదని చంద్రబాబును అడగగా.. పనీ ఏం లేక రాలేదని.. ఈ సందర్భంగా మీతో చాలా విషయాలు మాట్లాడాలని చంద్రబాబు కోరగా.. తాను కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నానని.. మరోసారి ఢిల్లీ రండి అని మోదీ చెప్పినట్టు చంద్రబాబే వివరించారు. మరోవైపు ఢిల్లీలో సీఎం జగన్ కు కూడా ప్రధాని అంతే ప్రాధాన్యత ఇచ్చారు. నీత్ ఆయోగ్ కార్యక్రమంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉండగా.. జగన్ భుజం తట్టి మోదీ మాట్లాడారు.. ప్రధాని కూర్చొన్న లంచ్ టేబుల్ దగ్గరే జగన్ కు అవకాశం ఇచ్చారు.
రాబోయే ఎన్నికల నేపథ్యతంలో ఇటు తెలుగు దేశం పార్టీ, అటు వైసీపీ రెండు బీజేపీ మద్దతు కోరుకుంటున్నాయి. ఓట్ల పరంగా బీజేపీతో ఎలాంటి లాభం లేకపోయినా.. ఇతర అంశాల విషయంలో బీజేపీ అవసరం తప్పని సరి అన్నది టీడీపీ, వైసీపీల లెక్క అని ప్రచారం ఉంది. అందుకే రెండు పార్టీలు బీజేపీ మద్దతు కోరుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు రాజస్యసభలో బిల్లుల విషయంలో తప్పా.. ఇతర పార్టీల మద్దతు అవసరం లేదు.. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది చెప్పలేం..
ఎందుకంటే ఎన్డీఏ నుంచి ఒక్కో పార్టీ బయటకు వస్తున్నాయి. తాజాగా బిహార్‌లో ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకుతూ ఎన్డీయే కూటమి నుంచి జేడీ(యు) నేత నీతీశ్ కుమార్ బయటకు వచ్చారు. ఆర్జేడీతో మరోసారి చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే కూటమి నుంచి జేడీ(యు) వైదొలగడం.. రాజ్యసభలో ఎన్డీఏ సంఖ్యాబలంపై కొంతమేర ప్రభావం చూపిస్తోంది. రాజ్యసభలో జేడీ(యు)కు ఐదుగురు ఎంపీలు ఉన్నారు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ కూడా ఈ పార్టీ నేతే. అయితే నితీశ్ అండగా ఉన్నప్పుడు కూడా రాజ్యసభలో ఎన్డీయేకు మోజార్టీ లేదు.
ఇదీ చదవండి : ఏపీని ముంచెత్తుతున్న వానలు.. ఈ టైంలో వాహనం సేఫ్‌గా ఉండాలంటే? ఈ టిప్స్ పాటించాల్సిందే
అయితే గత మూడేళ్లలో శివసేన, శిరోమణి అకాలీదళ్, ఇప్పుడు జేడీయు ఎన్డీయే నుంచి తప్పుకొన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చెప్పలేం.. ఇప్పటికిప్పుడు ఇతర పార్టీల అవసరం లేకపోయినా.. భవిష్యత్తులో మద్దతు తప్పని సరి అన్నది బీజేపీ పెద్దల లెక్క.. అయితే కోరి పార్టీల మద్దతు అడగడం కంటే.. వెంటన పడుతున్న వైసీపీ, టీడీపీల్లో ఒక పార్టీని దగ్గరకు చేర్చుకోవడం ఉత్తమం అనేది కేంద్ర పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు ఢిల్లీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి: పేద ప్రజలకు వరం.. సంజీవని ఆరోగ్య రథం.. సొంత ఖర్చులతో నారా లోకేష్ మరో కార్యక్రమం
ప్రస్తుతానికి అయితే జగన్ తోనే మోదీకి ఎక్కువ అవసరం ఉంది. రాజ్యసభలో అత్యధిక బలం ఉన్న వైసీపీని దూరం పెట్టడం కన్నా.. దగ్గర చేసుకోవడమే మేలన్నది మోదీ, అమిత్ షాల అభిప్రాయంగా తెలుస్తోంది.
ఇదీ చదవండి : పేద ప్రజలకు వరం.. సంజీవని ఆరోగ్య రథం.. సొంత ఖర్చులతో నారా లోకేష్ మరో కార్యక్రమం
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న నివేధికల ఆధారంగానే.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇటు టీడీపీని, అటు వైసీపీని రెండింటితో సఖ్యంగానే ఉండడం మంచిదని బీజేపీ భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.. అందుకే గతంలో చంద్రబాబును తీవ్రంగా విమర్శించే బీజేపీ నేతలు.. ఇప్పుడు మాట మార్చారు.. చంద్రబాబును పొగుడుతున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శిస్తే అండగా నిలబడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Politics, Chandrababu Naidu, Narendra modi, Nitish Kumar