Nagarjuna vs Narayana: సాధారణంగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున (Nagarjuna) తనపై విమర్శలు వచ్చినా స్పందించరు.. వాటి గురించి అస్సలు పట్టించుకోరు కూడా.. గతంలో ఆయనపై పెద్దగా విమర్శలు కూడా ఉండేవి కావు. కానీ బిగ్ బాస్ వ్యాఖ్యాతగా (Bigg Boss Host) కెరీర్ ప్రారంభించిన దగ్గర నుంచి కింగ్ నాగార్జున పై ట్రోల్స్, విమర్శలు పెరుగుతున్నాయి. అయితే ఎప్పుడూ వాటిపై ఆయన స్పందించినది లేదు.. అయితే ఇటీవల సీపీఐ నేత నారాయణ (CPI Narayana).. మాత్రం గ్యాప్ లేకుండా బిగ్ బాస్ షో పైనా.. నాగార్జున పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బిగ్ బాస్ షో వల్ల వల్ల సమాజానికి ఏం ఉపయోగం? మంచి వాళ్ళను చెడగొట్టడం తప్ప.. అంటూ ఇటు బిగ్ బాస్ షో పైనా మండిపడుతున్నారుు. అటు హోస్ట్ నాగార్జునపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
ఆ విమర్శలకు.. బిగ్ బాస్ హౌస్ వేదికపైనే నాగార్జున కౌంటర్లు ిఇచ్చారు.. తాజాగా శనివారానికి సంబంధించి ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. అందులో నాగార్జన.. హౌస్ లో ఉన్న కపుల్ ను పిలుస్తారు. రోహిత్.. మెరీనాని టైట్ హగ్ చేసుకో అంటారు.. మీకు లైసెన్స్ ఉంది.. మీరు భార్య భర్తలు కౌగలించుకోవడం తప్పు కాదు అంటూ.. నారాయణ నారాయణ అంటూ కౌంటర్ వేశారు. భార్య భర్తలు కౌగలించుకోవడం తప్పుకాదని చెప్పండి అంటూ.. నారాయణపై సెటైర్లు వేశారు.
Weekend fun ki siddham avvandi... With our King of entertainment????
Catch today's episode at 9 PM on @StarMaa & @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/p43Q0zKCWM — starmaa (@StarMaa) September 10, 2022
ఇంతకీ నాగార్జున ఈ స్థాయిలో ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది అంటే.. ఇటీవల సీపీఐ నారాయణ చేస్తున్న విమర్శలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. ఆయన ఏకం ఈ షోని రెడ్ లైట్ ఏరియాలో బ్రోతల్ హౌస్ తో పోల్చారు. హోస్ట్ చేస్తున్న నాగార్జునను కూడా వదిలిపెట్టలేదు నారాయణ.
ఏ అమ్మాయికి కిస్ ఇస్తావు? ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు? ఏ అమ్మాయిని పెళ్లాడతావ్? అని ముగ్గురు అమ్మాయిల ఫొటోలు పెట్టి అడుగుతున్నారని.. ఆ ఫొటోలలో నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లని పెట్టొచ్చు కదా అంటూ గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణ.
ఇదీ చదవండి : మరో మూడు రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఏ జిల్లాలపై ఎంత ప్రభావం ఉంటుంది..?
ఇలా నారాయణ వ్యాఖ్యలు నేరుగా నాగార్జునను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆయన సన్నిహితులు అంటున్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని.. అయినా తనను ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.. అందుకే ఇంకా సైలెంట్ గా ఉండడం మంచిది కాదని... బిగ్ బాస్ వేదికగానే ఇలా కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇదీ చదవండి : మళ్లీ భయపెడుతున్న టమాట ధరలు.. కారణం ఏంటో తెలుసా..?
ఇప్పటికైనా నారాయణ వెనక్కు తగ్గకపోతే.. నాగార్జునలో మరింత ఫైర్ కనిపించే అవకాశం ఉంది అంటున్నారు. అయితే నారాయణ బిగ్ బాస్ పై విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు.. బిగ్ బాస్ మొదలైన ప్రతిసారి ముందుగా విమర్శిస్తూనే ఉంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Andhra Pradesh, AP News, Bigg Boss 6 Telugu, CPI Narayana