Ex Minster Narayna: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పది పరీక్ష పేపర్ల లీకేజ్ (10th Paper leakage) వ్యవహారంపై దుమారం ఆగడం లేదు. ఈ కేసులో నారాయణ సంస్థదే ప్రముఖ పాత్ర అని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా (Chitoor District)ల్లో పేపర్ లీక్ అయ్యింది. నారాయణ ఎస్వీ బ్రాంచ్ (Narayana SV Branch) నుంచే అని.. అందులోనూ ఆ సంస్థలో వైస్ ప్రిన్సిపల్ వాట్సప్ నుంచే పేపర్లు బయటకు వచ్చినట్టు విచారణలో తేలింది. ఈ వ్యవహారమంతా మాజీ మంత్రి నారాయణ (Ex Minster)కు తెలిసే జరుగుతోంది అన్నది ప్రభుత్వం అనుమానం.. పేపర్ లీకేజ్ లో అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాధానం మేరకు తాము నారాయణను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో నారాయణను వదలకూడదని పోలీసులు భావించారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. కష్టడీలోకి ఇస్తే.. వాస్తవాలు చెప్పిస్తామంటూ.. పోలీసులు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఈ విషయంలో పోలీసులకు, ప్రభుత్వానికి షాక్ తగిలింది. అరెస్టైన నారాయణకు అదే రోజు అర్ధరాత్రే బెయిల్ లభించింది. ఈ కేసులో పోలీసులు ఎంతో సీరియస్ గా దర్యాప్తు చేసి కోర్టుకు ఆధారాలు సమర్పించినా కోర్టు మాత్రం తెల్లవారు జాము వరకూ విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది.
ఇప్పుడు ఆ బెయిల్ రావడం వెనుక ట్విస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నారాయణ అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజ్ కేసులో నారాయణ విద్యాసంస్ధల పాత్ర ఉందన్న పేరుతో సంస్ధ మాజీ ఛైర్మన్ అయిన నారాయణను పోలీసులు అరెస్టు చేసి చిత్తూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకొచ్చి మరీ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సర్కార్ కు అసిస్టెంట్ పబ్లిక్ ప్లాసిక్యూటర్ ట్విస్ట్ ఇచ్చారని సమాచారం.. దీంతోనే నారాయణకు సులువుగా బెయిల్ లభించిందని పోలీసులు భావించారు.
ఇదీ చదవండి : చంద్రబాబు సంచలన ప్రకటన.. ఆ సీనియర్ నేతకు ఊహించని షాక్.. టీడీపీ తొలి అభ్యర్థి ఎవరంటే..?
నారాయణ కేసులో చిత్తూరు పోలీసులు మోపిన అభియోగాలపై స్ధానిక మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్లాసిక్యూటర్ సుజాత అసంతృప్తి వ్యక్తి చేసినట్టు టాక్. అందుకే ఆమె ఆ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు నిరాకరించారని... చిత్తూరు పోలీసులు ఆమెను మెజిస్ట్రేట్ వద్దకు వచ్చి వాదించాలని కోరినా స్పందించలేదని.. నేరుగా ఫోన్లో డీఎస్పీ మాట్లాడినా ఏపీపీ సుజాత నుంచి స్పందన కరవైందన్న విషాయాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అందుకే నారాయణకు భారీ ఊరటే లభించిందన్నది పోలీసులు వాదన. చివరికి స్దానికంగా మరో న్యాయవాదిని తీసుకెళ్లి వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అనుకున్న స్థాయిలో వాదనలు వినిపించడంలో ఫెయిల్ అయ్యారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు..
ఇదీ చదవండి : సీఎం జగన్ ఇలాకాలో ఏం జరుగుతోంది? చంద్రబాబు టూర్ గ్రాండ్ సక్సెస్ కు రీజనేంటి..?
నారాయణ 2014లోనే విద్యాసంస్ధల ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆధారాలు మెజిస్ట్రేట్ కు సమర్పించారు. దీంతో ఆయనకు తెల్లవారు జామున బెయిల్ లభించింది. అదే నారాయణ ఆధారాలకు వ్యతిరేకంగా ఏపీపీ హాజరై గట్టిగా వాదనలు వినిపించి ఉంటే పరిస్దితి మరోలా ఉండేదని పోలీసులు అంటున్నారు. కానీ ఆమె ఆ పని చేయకపోవడంతో.. ఏపీపీ నే వెంటనే జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. ప్రభుత్వ న్యాయవాది అయి ఉండి పోలీసులు కోరినా, స్వయంగా ఫోన్ చేసి రమ్మన్నా స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉండిపోయిన ఏపీపీ సుజాతను ప్రభుత్వంపై చర్యలకు తీసుకుంది. ఆమె నిర్ణయంతోనే నారాయణకు బెయిల్ వచ్చిందన్నది పోలీసుల అభిప్రాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP 10th Exams 2022, Ap government, AP News, Narayana