Home /News /andhra-pradesh /

AP POLITICS BIG TWIST IN EX MINSTER NARAYAN ARREST IN 10 PAPER LEAKAGE ISSUE NOW CID PUT ANOTHER CASE ON HIM NGS GNT

Ex Minster Narayana: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ లో ట్విస్ట్.. తెలంగాణ పోలీసుల అభ్యంతరం.. గంటల వ్యవధిలో మరో కేసు

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

Ex Minster Narayna: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ కేసులో ట్విస్ట్.. పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే సరైన పేపర్లు లేవని తెలంగాణ సీఐడీ పోలీసులు అడ్డుపడ్డారు. కానీ గంటల వ్యవధిలోనే ల్యాండ్ పూలింగ్ కేసుగా మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    Ex Minster Narayana Arrest Case: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మాజీ మంత్రి నారాయణ (Ex Minster Narayana) అరెస్ట్ తో పొలిటిక్ హీట్ (Political Heat) పెరిగింది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పదో తరగతి పబ్లిక్ పేపర్ల లీకేజ్ వ్యవహారంలో.. హైదరాబాద్  (Hyderabad) వెళ్లి.. నారాయణ నివాసంలో ఆయన్ను ఏపీ సీఐడీ (AP CID) పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే పదో తరగతి పేపర్ల లీకేజ్ (AP 10th Paper Leakage) నారాయణ ఎస్వీ బ్రాంచ్ నుంచే జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థకు చెందిన గిరిధర్ అనే ఉద్యోగి వాట్సప్ నుంచే తెలుగు పేపర్ లీక్ అయ్యిందని పోలీసులు నిర్దారించారు.. దీంతో ఇప్పటికే పేపర్ లీకేజ్ వ్యవహరం ఆ బ్రాంచ్ కు చెందిన వైస్ ప్రిన్సిపల్ తో పాటు, మరో ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. తరువాత నుంచి నారాయణ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని.. ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారని.. అక్కడ నుంచి చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చి.. కోర్టులో హాజరు పరుస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

    అయితే ప్రశ్న పత్రం లీకేజీతో అరెస్టు చేసినట్టు మొదట సీఐడీ పోలీసులు చెప్పినట్టు సమాచారం. ఈ కేసు విషయంలో నారాయణను చిత్తూరుకు తరలించకుండా అడ్డుకున్న తెలంగాణ సిఐడి పోలీసులు అడ్డుకున్నారు. సరైన ఆధారాలు చూపించాలంటూ నిలిపేసినట్టుట సమాచారం. అయితే గంటల వ్యవధిలోనే కేసును మార్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజధాని భూముల కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. నిన్ననే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెబుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో నారాయణ అరెస్ట్ చేశామని చెబుతున్నారు.

    FIR on CBN,Narayana&Others by AllaRKReddy-9.5.22

    వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో రాజధాని అమరావతికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు పెట్టామన్నారు. ల్యాండ్ పూలింగ్‌ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 14 మంది పేర్లను పోలీసులు చేర్చారు. సోమవారం నాడే సీఐడీ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెబుతున్నారు. ల్యాండ్ పూలింగ్ ఎఫ్‌ఐఆర్‌లో A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని శేఖర్, A5గా అంజనీకుమార్, A6గా హెరిటేజ్ ఫుడ్స్‌ను పోలీసులు పేర్కొన్నారు. వీరిపై 120B, 420 సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఇదీ చదవండి : ముంచుకొస్తున్న అసని తుఫాను.. తీరప్రాంతాల్లో అల్లకల్లోలం.. విమానాలు రద్దు

    మరోవైపు మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై ప్రస్తుత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. పది పరీక్షల లీకేజ్ విషయంలో 60 మందిని అరెస్ట్ చేశాను అన్నారు. అందులో ప్రభుత్వ టీచర్లు.. ప్రైవేటు టీచర్చు కూడా ఉన్నారన్నారు.. ఈ పేపర్ల లీకేజ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది అంటున్నారు. అలాగే మాజీ మంత్రి ప్రమేయం ఉందా లేదా అన్నదానిపై పోలీసులు నిర్ధారిస్తారని మంత్రి బొత్స అన్నారు..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Narayana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు