Home /News /andhra-pradesh /

AP POLITICS BIG SHOCK TO YSRCP AS MLA MANAM RAMANARAYANA REDDY DAUGHTER ANAM KAIVALYA REDDY JOINED TDP FULL DETAILS HERE PRN GNT

AP Politics: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె.., నెల్లూరులో అధికార పార్టీకి షాక్..

నారా లోకేష్ తో ఆనం కుమార్తె కైవల్య

నారా లోకేష్ తో ఆనం కుమార్తె కైవల్య

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) మహానాడు (Mahanadu-2022) సందర్భంగా అధికార పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) మహానాడు (Mahanadu-2022) సందర్భంగా అధికార పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె, అల్లుడు టీడీపీలో చేరారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం వెంకటరామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి, అల్లుడు రితేష్ రెడ్డి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. ఇద్దరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆనం కుమార్తె టీడీపీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు నుంచి కైవల్య రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వంపై, వైసీపీ అధిష్టానంపై ఆనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన కుమార్తె టీడీపీలో చేరడం చర్చనీయాంశమైంది.

    మహానాడు సందర్భంగా టీడీపీలోకి వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆనం కుమార్తె వెళ్లి లోకేష్ ను కలవడంతో ఇటు నెల్లూరు వైసీపీలో కలకలం రేగింది. ఆనం ఎప్పటికైనా తిరుగుబావుటా ఎగరవేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్నందున నేపథ్యంలో ఆనమే ఆయన కుమార్తెను టీడీపీలోకి పంపారంటూ వైసీపీలో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆయన వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఆశించినా నెల్లూరు నుంచి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ అవకాశమిచ్చారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాకాణి గోవర్థన్ రెడ్డి పదవిని దక్కించుకున్నారు. తనకు పదవి రాకపోయినా కాకాణికి రావడంతో సంతృప్తి చెందారాయన.

    ఇది చదవండి: వైసీపీకి ఆదాయం ఎక్కువ... వ్యయం తక్కువ.., టీడీపీ పరిస్థితి రివర్స్..


    ఐతే కొంతకాలంగా ప్రభుత్వ తీరుపై ఆనం రామనారాయణ రెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. అధికారుల తీరు, అవినీతి వంటి అంశాలపై విమర్శలు గుప్పిస్తూనే పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగింది. టీడీపీ లేదా బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ కూడా జరిగింది. ఐతే ఆయన మాత్రం పార్టీ విధానాలను ప్రశ్నించారే తప్ప.. మార్పుపై ఎప్పుడూ చిన్న హింట్ కూడా ఇవ్వలేదు.

    ఇది చదవండి: వాళ్లని వదిలే ప్రసక్తే లేదు.. తిరుమల సాక్షిగా మంత్రి రోజా వార్నింగ్..


    తాజాగా ఆనం కుమార్తె టీడీపీలో చేరడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆయన కూడా సైకిల్ ఎక్కుతారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి తన కుమార్తె వెళ్లడంతో ఆనం కూడా పార్టీ మారతరా.. లేక వైసీపీలోనే కొనసాగుతారా అనేది వేచి చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Nellore Dist, TDP, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు