Home /News /andhra-pradesh /

AP POLITICS BIG SHOCK TO YCP MORE LEADERS COMMENTS AGAINST PARTY WHAT HAPPENED NGS

YCP Rables: సొంత పార్టీకే షాకిస్తున్న వైసీపీ నేతలు.. పెరుగుతున్న వ్యతిరేక స్వరం దేనికి సంకేతం

హైకామండ్ కు తలనొప్పిగా వర్గపోరు

హైకామండ్ కు తలనొప్పిగా వర్గపోరు

YCP Rables: అధికార వైసీపీలో రెబల్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మొన్నటి వరకు ఎంపీ రఘురామ రాజు ఒక్కరే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు.. ఇప్పుడు చాలామంది నేతలు పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. పాలనపై అసమ్మతి తెలియజేస్తున్నారు.. ఇది దేనికి సంకేతం..

ఇంకా చదవండి ...
  YCP Rables: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అధికార వైసీపీ రోజు రోజుకూ షాక్ లపై షాక్ లు తగులుతున్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వం పాలించినా.. జనాల్లోనూ.. గతంలో ఓట్లు వేసిన వారిలో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది..  ఇప్పుడు అధికార వైసీపీ  పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.. పార్టీకి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఒక్క ఎంపీ రఘురామ రాజు (MP Raghu Rama Raju)తో మొదలైన వ్యతిరేకత.. నెమ్మ‌ది నెమ్మ‌దిగా పెరుగుతూ వస్తోంది. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆ పార్టీ రెబ‌ల్ ప్ర‌జాప్ర‌తినిధిగా కొనసాగుతున్నారు. సాంకేతికంగా మాత్ర‌మే ఆయ‌న వైసీపీలో ఉన్నారు. రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి ఎంపీకి, పార్టీకి జ‌రుగుతున్న పోరు కొనసాగుతూనే ఉంది. కేసులు, అరెస్టుల వరకు వ్యవహారం వెళ్లింది.  ఇది కేవలం ఒక్క రఘురామ రాజుకు మాత్రమే పరిమితం అవ్వడం లేదు.. అలాంటి వారి  ప్ర‌భుత్వంలో రోజురోజుకు పెరిగిపోతున్నార‌నే అభిప్రాయం ఆ పార్టీలోనే వ్య‌క్త‌మ‌వుతోంది.

  తాజాగా నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి (kotam Reddy Sridhar Reddy), ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి (Rachamallu Shivaprasad Reddy), ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ (Maddisetti Venugopal) లాంటివారే కాకుండా ఇంకెంతోమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నార‌ని, పార్టీపై ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.  ముఖ్యంగా జగన్ కేబినెట్ రెండో విడ‌త‌లో మంత్రి ప‌ద‌వులు ఆశించి అవి ద‌క్క‌నివారు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలామంది బహిరంగంగానే విమర్శలు చేస్తుంటే.. మరికొందరు లోలోనే మదనపడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యే పక్క పార్టీలవైపు చూస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. తాజాగా ఇద్దరు వైసీపీ కీలక నేతలు.. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అందులో ఓ ఎమ్మెల్యే కూడా ఉండడం వైసీపీ కేడర్ ను కలవర పెడుతోంది. ఏదో జరుగుతోందనే అనుమానలు పెరుగుతున్నారు.

  ఇదీ చదవండి : ఏపీ సీఎం జగన్.. త్వరలోనే దేశ ప్రధాని అవుతారు.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  తాజాగా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎటువంటి నిధులు కేటాయించ‌డంలేదంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి మురుగుకాల్వ డ్రెయినేజీలో కూర్చొని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అంతకుముందు కూడా.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఉంది క‌దా అని ప్ర‌తిప‌క్షాల‌పై దాడుల‌కు దిగితే ఆ త‌ర్వాత వారు మ‌న‌కు బుద్ధిచెబుతార‌ని, అంద‌రినీ సామ‌ర‌స్యంగా క‌లుపుకుపోవాలంటూ కొద్దిరోజుల క్రిత‌మే ఆయ‌న వ్యాఖ్యానించారు.

  ఇదీ చదవండి : జనసేన కాదు ధనసేన.. పవన్ రాజకీయ నాయకుడు కాదు.. ఆప్షనల్ పొలిటీషియన్

  రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి అయితే సీఎం జగన్ ను తీవ్రంగా వ్యతిరేకించే.. దిన‌ప‌త్రిక‌ను పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీని సైతం పొగిడారు. మరోవైపు దర్శి ఎమ్మెల్యే వ్యాఖ్యలు సైతం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే నిలుస్తున్నాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీట నొక్కి మంచి పేరు తెచ్చుకుంటున్నార‌ని, నిధులు లేక తాము మాత్రం ప్ర‌జ‌ల్లో చెడ్డ‌పేరు తెచ్చుకుంటున్నామంటూ మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ హాట్‌గా మారాయి. మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత తొలిసారిగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా స్వ‌రం వినిపిస్తున్న‌వారు వీరొక్క‌రే కాద‌ని, వినిపించకుండా సైలెంట్ గా ఉన్న‌వారు కూడా ఎంతోమంది ఉన్నారంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంవ‌ల్ల ప్ర‌జ‌ల్లో త‌మ‌మీద వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌నేది ఎమ్మెల్యేలంద‌రి అభిప్రాయంగా ఉంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు