హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sajjala on Vijaysaireddy: లిక్కర్ స్కామ్ లో విజయసాయి అల్లుడి అరెస్ట్..! సజ్జల ఏమన్నారంటే..?

Sajjala on Vijaysaireddy: లిక్కర్ స్కామ్ లో విజయసాయి అల్లుడి అరెస్ట్..! సజ్జల ఏమన్నారంటే..?

విజయసాయి రెడ్డి అల్లుడి అరెస్ట్ పై సజ్జల వివరణ

విజయసాయి రెడ్డి అల్లుడి అరెస్ట్ పై సజ్జల వివరణ

Sajjala on vijayasaireddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఢిల్లీ లిక్కర్ స్కామ్ షేక్ చేస్తోంది. అరెస్టులతో వైసీపీకి లింకులపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా విజయసాయి రెడ్డి అల్లుడు అరెస్ట్ అయ్యాడనే వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై సజ్జల స్పందిస్తూ ఏమన్నారంటే?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Sajjala Ramakrishna Reddy on Vijayasai Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలను (Andhra Pradesh Politics) కుదుపుతోంది. ఈ స్కామ్‌లో తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యక్తులు అరెస్ట్ అవుతుండడం సంచలనంగా మారింది. అరబిందో ఫార్మా డైరెక్టర్, జీఎం శరత్‌ చంద్రారెడ్డితో పాటు వినయ్‌బాబు అరెస్ట్ చేశారు ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు నిందితులను ఈడీ అరెస్ట్ చేయగా, ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. వీళ్లిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. సెప్టెంబర్‌లో శరత్‌చంద్రారెడ్డిని ప్రశ్నించారు. లిక్కర్‌స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ దూకుడుగానే ముందుకు వెళ్తున్నాయి ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా వైసీపీకి లింకులపై సోషల్ మీడియా (Social Media) లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీ అలర్ట్ అయ్యింది. విజయసాయి రెడ్డి (Vijayasai Reddy ) అల్లుడు అరెస్ట్ అయ్యారు అనే వార్తలపై సజ్జల రామ కృష్ణారెడ్డి  (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. విజయసాయిరెడ్డికి ఒకరే కూతురు ఉన్నారని ఆయన వివరణ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం అరెస్టు అయ్యింది విజయసాయి అల్లుడు కాదని స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడని మాత్రమే అరెస్ట్ చేశారంటూ.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అరబిందో అనేది పెద్ద వ్యాపార సంస్థ అని చెప్పారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న అంతర్జాతీయ వ్యాపార సంస్థ అని అన్నారు.

అంత పెద్ద సంస్థకు చెందిన వ్యక్తులు విజయసాయిరెడ్డికి బంధువులు మాత్రమే అన్నారు. వాళ్ళ వ్యాపార సంస్థకు ఈయనకు సంబంధం ఏంటి అని తిరిగి ప్రశ్నించారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో డిల్లీ, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చాలా కాలంగా పొలిటికల్ వార్ జరుగుతోందన్న విషయం గుర్తు చేశారు. ఆ రాజకీయ వార్ తో ఏపీ ప్రభుత్వానికి కానీ, వైసీపీకి కానీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కానీ.. ఇతర తమ పార్టీ నేతలకు కానీ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

కేవలం విపక్ష నేతలకు ప్రజల్లో ఆదరణ లేకపోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో కలవకతప్పని పరిస్థితి వచ్చిందనే ఊహాచిత్రాన్ని ఆ పార్టీల నేతలు సృష్టిస్తున్నారని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు, పవన్ కుట్ర బుద్ధి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. గతంలో జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్రలు జరిగాయన్నారు. అయినా ప్రతిపక్షాలు ఏకం కావడంలో తప్పు లేదని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి : తిరుమల లడ్డు బరువు తగ్గుతోందా..? యువకుడి పోస్ట్ వైరల్.. టీటీడీ ఏమందంటే..?

ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీరు బాలేదని ప్రచారం చెయ్యడంలోనూ తప్పులేదని అన్నారు. కలిసి లేనట్టు పైకి నటిస్తూ లోపల కలిసి పని చెయ్యడమే తప్పని చెప్పారు. జనసేన సభకు భూమి ఇచ్చిన వారిలో ఒక్కరు మినహా మిగతా ఎవరి ప్రహరీ గోడనూ అధికారులు కూల్చలేదని వివరణ ఇచ్చారు. అలాగే ఇప్పటంలో జరిగిన కూల్చివేతల వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారని, ఒకే పార్టీ ఒకే వర్గం వాళ్ళు ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. కేవలం చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్, లోకేశ్ పర్యటనలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, ఏదేదో జరిగిపోతుందని ఓ కుట్ర పూరితంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రాకుండా చెయ్యాలని కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. మహిళలకి సీఎం జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్లు ఇళ్ల నిర్మాణం కోసం కర్చు చేశామని అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Delhi liquor Scam, Sajjala ramakrishna reddy, Vijayasai reddy

ఉత్తమ కథలు