హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Shock to YCP: వైసీపీకి ఊహించని షాక్.. ఆ ఎన్నికల్లో ఘోర ఓటమి.. ఉక్కు దెబ్బ బాగానే పడిందా..?

Big Shock to YCP: వైసీపీకి ఊహించని షాక్.. ఆ ఎన్నికల్లో ఘోర ఓటమి.. ఉక్కు దెబ్బ బాగానే పడిందా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Big Shock to YCP: ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత.. తిరుగులేని పార్టీలో వైసీపీ ముద్ర వేసింది. ఓటమి లేని పార్టీ తమది అంటూ వైసీపీ నేతలు జబ్బలు చరుచుకున్నారు. ఎన్నిక ఏదైనా ఫ్యాన్ దే విజయం అంటూ తొడలు కొట్టారు. అలాంటి పార్టీకి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది.. ముఖ్యంగా ఉక్కు దెబ్బ గట్టిగానే పడింది అంటున్నాయి విపక్షాలు.

ఇంకా చదవండి ...

Big Shock to YCP:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలో ఎత్తులపై ఎత్తులతో దూకుడుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచి ప్రచారాలు మొదలు పెట్టేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతున్నాయి. ఇతర పార్టీలతో పోలిస్తే.. అధికార వైసీపీ (YCP) మరింత దూకుడుగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత.. ఓటమి లేని పార్టీగా దూసుకుపోతోంది. ఎన్నిక ఏదైనా వైసీపీ బరిలో ఉన్నా.. లేదా వైసీపీ మద్దతు దారులు బరిలో ఉంటే.. విపక్షాలు విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే.. అంత బలమైన పార్టీకి ఊహించని షాక్త గిలింది. ఉక్కు ఉద్యమం ఎఫెక్ట్ బాగానే పడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్  ( Vizag Steel Plant ) ఎన్నికల్లో.. వైసీపీ అనుబంధ కార్మిక సంఘం పోటీ చేయకుండానే ఓటమి పాలైంది. వైసీపీ కీలక నేతలు ప్రచారం చేసినా.. ఫలితాలు మాత్రం రివర్స్ అయ్యాయి. మరోవైపు ఇదే ఎలక్షన్‌లో.. టీడీపీ అనుబంధ కార్మిక సంఘం సపోర్ట్ చేసిన యూనియన్ ఘన విజయం సాధించింది. దీంతో ఈ ఫలితాలు విశాఖ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీంతో ఆ ప్రయత్నాన్ని ఆపేందుకు ఉక్కు కార్మికులంతా.. వందల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఏపీ బీజేపీ మినహా.. రాష్ట్రంలో అన్నిప్రధాన పార్టీలు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్ధతు తెలిపాయి. దీక్షల్లో కూడా పాల్గొన్నాయి. అధికార పార్టీ తరపున ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర కూడా చేశారు. అయితే ఇదంతా కేవలం కార్మికుల మెప్పు పొందేందుకే అని.. నిజంగా ప్రభుత్వం చిత్త శుద్ధితో వ్యవహరించలేదని కార్మికులు అభిప్రాయానికి వచ్చినట్టు ఉన్నారు. ఆ ప్రభావం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో యూనియన్ ఎన్నికలపై పడింది. అందుకే ఈ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని విధంగా ఉక్కు సెగ తాకిందనే చర్చ విశాఖలో జోరుగా సాగుతోంది.

ఇదీ చదవండి : కాగితంపై సంతకం చేసిన వారికే మా మద్దతు.. కాంగ్రెస్ తో పొత్తుపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

వైసీపీకి అనుబంధ యూనియన్ ఈ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. నేరుగా బరిలోకి దిగకుండా.. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీకి మద్దతిచ్చింది. స్టీల్ ప్లాంట్ లోపల INTUC, బయట.. వైసీపీ నేతగా చలామణి అవుతున్న కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్.. INTUC ప్యానెల్ తరఫున పోటీ చేశారు. ఇక AITUCకి టీడీపీ అనుబంధ కార్మిక సంఘం.. TMTUC మద్దతిచ్చింది. వైసీపీ మద్దతిచ్చిన INTUCకి, టీడీపీ సపోర్ట్ చేసిన AITUCకి మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. ఈ కీలక పోరులో 9 వేల మందికి పైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఓట్లు వేశారు. వైసీపీ మద్దతిచ్చిన INTUCపై.. AITUC 466 ఓట్ల తేడాతో గెలిచింది. ఇది ఘన విజయమని.. ఉక్కు కార్మికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఆచార్య సినిమాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్టీల్ ప్లాంట్ యూనియన్ ఎన్నికల్లో.. వైసీపీ తరఫున కీలక నేతలంతా ప్రచారం చేశారు. విశాఖ ఎంపీ.. ఎంవీవీ సత్యనారాయణ కూడా ఉక్కు గేటు దగ్గర సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ.. కార్మికులు వైసీపీ మద్దతిచ్చిన INTUC యూనియన్‌ని ఓడించారు. ఇక.. స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో.. తెలుగుదేశం అనుబంధ సంఘం TNTUC సంపూర్ణ మద్దతు పలకడంతో.. ఆ పార్టీ నాయకులు కూడా ప్రచారం చేశారు. AITUC విజయం సాధించడంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చక్రం తిప్పారు. వీరితో పాటు TNTUC అధ్యక్షులు విల్లా రాంమోహన్ కుమార్, ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్ బాబు.. స్టీల్ ప్లాంట్ విషయంలో..

ఇదీ చదవండి : ఏపీలో పేదలకు బిగ్ షాక్.. ఫ్రీ రేషన్ లేనట్టే.. సర్కారు చేతులెత్తేసిందా?

టీడీపీ అనుబంధ కార్మిక సంఘం మద్దతిచ్చిన ఏఐటీయూసీ గెలవడంతో.. విశాఖ ఉక్కు కార్మికుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో.. వైసీపీకి తెలిసొచ్చిందంటున్నారు. నిజానికి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలు చిన్న విషయమే అయినప్పటికీ.. అందులో అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘం పోటీ చేయకపోవడం, మరో యూనియన్‌కి మద్దతివ్వడం.. అది కూడా ఓటమిపాలవ్వడమనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఈ ఫలితాలు కచ్చితంగా భవిష్యత్తులో విశాఖ జిల్లా రాజకీయాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, TDP, Vizag Steel Plant, Ysrcp

ఉత్తమ కథలు